తెలుగు భాషలో తెరకెక్కిన బాహుబలి: ది కన్క్లూజన్ తమిళం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అనువాదమై ప్రపంచవ్యాప్తంగా 9 వేల థియేటర్లలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సృష్టించిన ఈ మూవీ అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో దూసుకుపోతోంది. ప్రభాస్, రానా పోటీపడి నటించిన ఈ సినిమా ఆరు రోజుల్లో 800 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి తెలుగు వారి సత్తాని ప్రపంచానికి చాటుతోంది.
ఈ మూవీని మరో రెండు భాషల్లోకి డబ్బింగ్ చేసి మరింత మందికి ఈ విజువల్ వండర్ ను చేరువ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. చైనా, జపాన్ భాషల్లో డబ్బింగ్ చెప్పించే పనిలో ఉన్నారు. ఈ రెండు దేశాల్లో బాహుబలి బిగినింగ్ మంచి కలక్షన్స్ వసూలు చేసింది. బాహుబలి-2 అంతకంటే భారీ వసూళ్లు రాబడుతుందని నమ్మకంతో ఉన్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.