టెన్షన్ లో ప్రభాస్ ఫ్యాన్స్…రివ్యూలే కారణమా?

  • April 27, 2017 / 05:49 AM IST

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ తమ అభిమాన హీరోల సినిమాల విషయంలో మన అభిమానులు ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ గా ఉంటారు…అయితే అదే క్రమంలో ఆన్‌లైన్ సైట్స్ ఎక్కువగా పెరిగిపోవడంతో…రోజురోజుకూ సినిమాలపై గాసీప్స్ సైతం అలానే పుట్టుకొస్తున్నాయి…ఇంకా చెప్పాలి అంటే సినిమా ఇంకో రెండు రోజుల్లో విడుదల అవుతుంది అనే లోపే…సినిమా రివ్యూ వచేస్తుంది…అదీ చాలా పాసిటివ్ గానే లెండి…ఎందుకంటే నెగేటివే గా రాస్తే, ఫ్యాన్స్ దుమ్ము దులిపెయ్యరు…ఇదిలా ఉంటే సినిమా విషయంలో ఎక్కడైనా నెగేటివ్ రేటింగ్స్ వస్తే భయపడాలి కానీ…5/5 రేటింగ్ ఇచ్చినా టెన్షన్ పడుతున్నారు మన ప్రభాస్ అభిమానులు…దానికి కారణం ఏంటి అంటే…భారతీయ చిత్రాలను ముందే చూసే యూఏఈకి చెందిన సినీ విమర్శకుడు ఉమేర్ సంధూ ఈ సినిమాపై రివ్యూ ఇచ్చేశాడు. దుబాయ్ లో జరిగిన ఈ సినిమా ప్రీమియర్ షోను చూసి ఉమేర్ సంధూ ‘బాహుబలి 2’ సినిమాకు 5 స్టార్లు ఇచ్చేశాడు…పనిలో పనిగా సినిమా గురించి…ట్వీట్ చేస్తూ….సినిమా  అద్భుతంగా, చూడముచ్చటగా ఉంది, భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని చిత్రం ‘బాహుబలి’ అని ఆకాశానికి ఎత్తేస్తుస్తున్నాడు.

ముఖ్యంగా…ఈసినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్, సౌండ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ప్రధానంగా బాహుబలి2 స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది అని అంటూ ఈమూవీకి సంబంధించి మైండ్ బ్లోయింగ్ స్టోరీ  స్క్రీన్ ప్లే ఆయువుపట్టు అంటూ ట్వీట్ చేసాడు. ఈ సినిమా చరిత్ర తిరగరాయడం ఖాయం అని అంటున్నాడు. ఇంతవరకూ సూపర్ ఉంది కానీ…అసలు ట్విష్ట్ ఇక్కడే ఉంది….అదేమిటంటే…గతంలో ఉమేర్ ‘బ్రహ్మోత్సవం’ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘కాటమరాయుడు’ సినిమాలను ఇలా విడుదల కాకుండానే ముందే చూసి ఆ సినిమాలు అద్భుతం అంటూ రివ్యూలు వ్రాసాడు. వాటి పరిస్థితి ఏమయ్యింది మనకు తెలిసిందే…ఇప్పుడు దే టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉంది…మరి రిసల్ట్ ఏమవుతుందో…రేపే తేలిపోతుంది…


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus