“బాహుబలి-2” సినీ విశేషాలను వివరించనున్న రాజమౌళి

Advertisement

ఒక చిత్రం కోసం మూడేళ్లుగా ఎదురు చూడడం అనేది తెలుగు సినీ చరిత్రలో బాహుబలి విషయంలోనే జరిగింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి బిగినింగ్ గత ఏడాది విడుదలై రికార్డులను సృష్టించడమే కాకుండా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు ? అనే ప్రశ్నను బుర్రలోకి ఎక్కించింది. అందుకు సమాధానం తెలుసుకోవాలని సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల అంచనాలకు మించేలా సినిమాను రూపొందించాలని జక్కన్న బృందం శ్రమిస్తోంది.

ఇప్పటివరకు క్లైమాక్స్‌తో పాటు పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సినిమా ప్రోగ్రస్ గురించి చెబుతున్న చిత్ర బృందం తొలిసారి  మీడియా ముందుకు రానుంది. రేపు సాయంత్రం హైదరాబాద్ లో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించనుంది. ఇందులో సినిమా ప్రొడక్షన్, ప్రీ రిలీజ్ బిజినెస్, పోస్టర్స్, టీజర్, రిలీజ్ సంబంధిత అన్ని వివరాలను రాజమౌళి వెల్లడించనున్నట్లు తెలిసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus