సత్యరాజ్ మైనపు విగ్రహం సిద్ధం.!

  • March 12, 2018 / 07:06 AM IST

“బాహుబలి” చిత్ర కథానాయకుడు ప్రభాస్ మైనపు విగ్రహం బ్యాంకాక్ లోని మేడమ్ టూస్సాడ్ మ్యూజియంలో గతేడాది పెట్టిన విషయం తెలిసిందే. ఈ స్టాట్యూ ప్లేస్ మెంట్ అనంతరం ప్రభాస్ ఖ్యాతి దశదిసలా వ్యాపించింది. ప్రభాస్ తర్వాత “బాహుబలి” చిత్రంలో అదేస్థాయి నటన, స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకొన్న సీనియర్ నటుడు సత్యరాజ్. నమ్మిన బంటు కట్టప్పగా బాహుబలి స్థాయిలో పేరు సంపాదించుకొన్న పాత్ర సత్యరాజ్ ది.

అందుకే ఇప్పుడు ఆయన విగ్రహాన్ని కూడా మేడమ్ టూస్సాడ్స్ మ్యూజియం, బ్రిటన్ లో ప్లేస్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆల్రెడీ మేకింగ్ చివరి దశలో ఉన్న సత్యరాజ్ మైనపు విగ్రహాన్ని త్వరలోనే బ్రిటన్ లోని టూస్సాడ్ మ్యూజియంలో ప్లేస్ చేయనున్నారు. దీంతో ఇప్పుడు “బాహుబలి” సినిమా ఖ్యాతి మరింత పెరగనుంది. అలాగే.. “బాహుబలి”కి ముందు వరకూ కేవలం తమిళనాడు వరకే పరిమితమైన సత్యరాజ్ స్టార్ డమ్ ఇప్పుడు దేశవిదేశాలకు వ్యాపించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus