14 నందులను సొంతం చేసుకున్న బాహుబలి బిగినింగ్!

  • November 15, 2017 / 07:26 AM IST

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆవిష్కరించిన బాహుబలి బిగినింగ్ ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల మనసులనే కాదు.. ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. మా అవార్డ్స్, ఐఫా అవార్డ్స్, ఫిలిం ఫేర్ అవార్డులు మాత్రమే కాకుండా రెండు జాతీయ అవార్డులను కైవశం చేసుకుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన నంది అవార్డ్స్ లోను హవా చూపించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు (రాజమౌళి), ఉత్తమ విలన్ (రానా), ఉత్తమ సహాయనటి (రమ్యకృష్ణ), ఉత్తమ సంగీత దర్శకుడు (కీరవాణి).. ఇలా వివిధ విభాగాల్లో మొత్తం 14 నందుల్ని కైవసం చేసుకొంది.

దీంతో మరోసారి బాహుబలి బృందానికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీకి ఈ అవార్డులు మరింత హోదాను తీసుకొచ్చాయి. సాహసోపేతమైన అడుగులు వేసే ఫిలిం మేకర్స్ నంది అవార్డ్స్ ప్రోత్సాహంగా నిలిచాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus