కేసీఆర్ బయోపిక్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న బాహుబలి రచయిత.!

  • March 28, 2018 / 08:02 AM IST

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. మహానటి సావిత్రి జీవిత గాధ రిలీజ్ కి ముస్తాబవుతోంది. మహానటుడు, పేదల నాయకుడు నందమూరి తారకరామారావు బయోపిక్ మూవీ షూటింగ్ మొదలయింది. ఇక దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ మూవీ కూడా సెట్స్ పైకి వెళ్ళడానికి రేడే అవుతోంది. తాజాగా మరో రాజకీయనాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు కె చంద్ర శేఖర్ రావు జీవిత గాధను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈశ్వర్ నివాస్ బాలీవుడ్ లో డైరక్టర్ గా స్థిరపడ్డారు. వర్మ దగ్గర దర్శకత్వంలో మెళకువలు నేర్చుకున్న ఇతను కేసీర్ బయోపిక్ ని తెరకెక్కించనున్నారు.

లక్ష్మణ్ కాంతం నిర్మించనున్న ఈ సినిమాకి  బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్  స్క్రిప్ట్ రాస్తున్నారు. ఈ విషయం పై అతన్ని అడగగా నిజమేమని చెప్పారు. “కేసీఆర్ బయోపిక్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేయమని లక్ష్మణ్ కాంతం, ఈశ్వర్ నివాస్ కు నన్ను సంప్రదించిన మాట వాస్తవం. అయితే ఇంకా ఇది తొలి దశలోనే ఉంది. ఒక రూపం వచ్చిన తర్వాత, అది ఆసక్తికరంగా వచ్చినప్పుడు నేను ఆ స్క్రిప్ట్ ని వారికీ అందిస్తాను. అప్పటి వరకు ఈ సినిమా గురించి ఎక్కువగా చెప్పలేను” అని విజయేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. త్వరలో ఎన్నికలు వస్తున్నందున అప్పటిలోపున ఈ సినిమా రిలీజ్ కావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus