టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ…తెలుగు సినిమా ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసిన సినిమా బాహుబలి….ఈ సినిమా సృష్టించిన రికార్డుల ప్రభంజనం అంతా ఇంతా…కాదు…అయితే ఈ సినిమా మొదటి భాగాన్ని ముగిస్తూ…రెండో భాగం పై అంచనాలను భారీగా పెంచేసాడు దర్శకుడు రాజమౌళి….అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్న గురించి యావత్ ప్రపంచం ఆలోచించుకుని…డిస్కస్ చేసుకుని….దాని గురించి డిబేట్ కూడా చేసుకునేలా చేశాడు మన రాజమౌళి…
అయితే అదే క్రమంలో ఈ సినిమా మొదలి భాగం ఎంత పెద్ద హిట్ అయ్యిందో…అన్న విషయం పక్కన పెడితే…రెండో భాగంపై చాలా ఆశలే పెట్టుకున్నారు మన ప్రేక్షక దేవుళ్ళు..ఇదిలా ఉంటే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న క్రమంలో అనుకోకుండా ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ఆన్‌లైన్ లో ప్రత్యక్షమవడంతో అందరూ ఒక్కసారిగా అవ్వాక్కు అయ్యారు. దాదాపుగా రెండు వీడియోలు ఆన్‌లైన్ లో హల్‌చల్ చేస్తున్నాయి. షాట్ నంబర్6 నుంచి షాట్ నంబర్ 60 వరకూ యుద్దానికి సంభందించిన సీన్స్ లీక్ అయ్యినట్లు తెలుస్తుంది…అయితే ఆ వీడియోస్ ను చూసి ఒక పక్క నెటిజెన్స్ ఎంజాయ్ చేస్తుంటే….మరో పక్క అంతటి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇలా పైరసీ భారిన పడటం నిజంగా చాలా బాధాకరం…
ఈ సినిమాను ఇలా ఆన్‌లైన్ లో అప్‌లోడ్ చేసిన వారు ఎవరైనా కఠిన శిక్షలు తప్పవు అని మాత్రం తెలుస్తుంది….అయినా ఇలాంటి అద్భుతాలను దార్జాగా హాల్ లో చూసి ఆనందించాలి కానీ….ఆన్‌లైన్ లో దొంగతనంగా చూడటం ఎంతవరకూ సబబు…..ఇలాంటి పైరసీ వల్ల మళ్లీ ఏ దర్శక నిర్మాతలు ఇలాంటి సినిమాలు తీయడానికి ముందుకు రారు….ఈ వ్యవహారం అంతా చూస్తుంటే…పైరసీ భూతం ఎంత లోతుకి చొచ్చుకుపోయిందో అర్ధం అవుతుంది…ఇప్పటికైనా యువతరం మేల్కోని…సినిమాను దార్జాగా…గౌరవంగా….థియేటర్స్లో చూడాలని, పైరసీ భూతాన్ని అరికట్టాలని ఆశిద్దాం…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.