రికార్డుల కౌంటింగ్ మొదలు పెట్టిన బాహుబలి 2 ట్రైలర్

  • March 17, 2017 / 07:22 AM IST

ఏనుగు కుంభస్థలం పై ఒక కాలు పెట్టి ఎక్కుతున్న బాహుబలి మోషన్ పోస్టర్ చూసినప్పుడు ఎవరూ అంచనా వేయలేక పోయారు… బాహుబలి కంక్లూజన్ రికార్డుల కుంభస్థలాన్నే కొడుతుందని!, ఇప్పుడే అదే జరిగింది. ఎస్.ఎస్. రాజమౌళి ఊహించిన దానికంటే బాహుబలి 2 ట్రైలర్ ఎక్కువ వ్యూస్ అందుకుంది. గురువారం ఉదయం విడుదలయిన ఈ వీడియో 24 గంటలు తిరగక ముందే ఒక తెలుగు వెర్షన్ కి మాత్రమే రెండు కోట్ల ఇరవై లక్షల వ్యూస్ వచ్చాయి. టాలీవుడ్ లోనే కాదు, సౌత్ ఇండియాలోని ఏ సినిమా ట్రైలర్ కి ఇన్ని వ్యూస్ రాలేదు. ఇది ఒక రికార్డు కాగా, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లోని ట్రైలర్ ని ఒక రోజులో చూసిన వారి సంఖ్య 5 కోట్లు దాటి పోయింది.

బాలీవుడ్ సినిమా ట్రైలర్లు ఈ మార్క్ చేరుకోవడానికి పది రోజులు సమయం అయ్యేది. ఆ రికార్డును ఒక రోజులోనే ప్రభాస్ నెలకొల్పాడు. బాహుబలి కంక్లూజన్ ఏప్రిల్ 28 న  థియేటర్లోకి రానుంది, అప్పటి లోపున ఇంకెన్ని యూట్యూబ్ రికార్డులు బద్దలు కానుందో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus