బాహుబలి కంక్లూజన్ అన్ని రికార్డులను దాటుకొని దూసుకు పోతోంది. గత నెల 28 న ప్రపంచవ్యాప్తంగా 9,000 థియేటర్లలో విడుదలైన ఈ మూవీ నిన్నటితో రెండు వారాలు పూర్తిచేసుకుంది. అయినా బాక్స్ ఆఫీస్ వద్ద బాహుబలి 2 కలక్షన్ల తుఫాన్ తగ్గలేదు. పది రోజులకే వెయ్యికోట్ల మైలురాయిని చేరుకొని భారత చలనచిత్ర పుస్తకానికి ముఖచిత్రంగా నిలిచినా ఈ ఫిల్మ్ రెండు వారాలకు ప్రపంచవ్యాప్తంగా 1,250 కోట్ల గ్రాస్ వసూలు చేసి తెలుగువారి ప్రతిభను ప్రపంచానికి చాటింది. దేశవ్యాప్తంగా 1020 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, 805 కోట్ల నెట్ సొంతం చేసుకుంది.
ఓవర్సీస్ లోను బాహుబలి ప్రభంజనం మామూలుగా లేదు. రెండు వారాల్లో 230 కోట్ల గ్రాస్ రాబట్టింది. కేవలం హిందీ వెర్షన్ మొదటివారానికి 247 కోట్లు వసూలు చేయగా, రెండు వారాలకు 390.25 కోట్లు కొల్లగొట్టి అనువాద చిత్రం ఇంత పెద్దమొత్తంలో కలక్షన్ వసూలు చేయగలదని నిరూపించింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.