ఈ నెల 24న బాబు బంగారం ఆడియో రిలీజ్ ?

  • July 15, 2016 / 06:27 AM IST

తులసి, లక్ష్మీ చిత్రాల తర్వాత విక్టరీ వెంకటేష్, నయనతార జంటగా నటిస్తున్న సినిమా బాబు బంగారం. ఈ హిట్ పెయిర్ మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ తో హ్యాట్రిక్ కొట్టనున్నారు. ఈ ఫిల్మ్ ఆడియో రిలీజ్ కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. మొదట ఈనెల 9న పాటలను విడుదల చేస్తామని ప్రకటించిన చిత్ర బృందం ఒక పాట తోనే సరి పెట్టారు.

”మల్లెల వానలా…” అనే రొమాంటిక్ సాంగ్ ని మూవీ యూనిట్ సభ్యులు రెడ్ ఎఫ్ఎం స్టూడియోలో లాంచ్ చేశారు. వెంకీ కోసం మహమ్మద్ జిబ్రాన్ స్వరపరిచిన గీతాలను విందామని ఎదురుచూసిన అభిమానులకు ఈ ఒక్క పాట శాంతింపజేసింది. ఈ సాంగ్ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. మిగతా పాటలను వెంటనే వినాలనే ఆశను రేకెత్తించింది. బాబు బంగారం ఆల్బమ్ ను ఈనెల 24 రిలీజ్ చేసేందుకు మారుతి ప్లాన్ చేస్తున్నట్లు తాజా సమాచారం.

ఒక పాట చిత్రీకరణ మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్నఈ సినిమాను ఆగస్టు 12 న విడుదల చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. అందుకే ఈ నెల ఎలాగైనా పాటల వేడుకను నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ గారి సమర్పణలో పీడీఏ ప్రసాద్, నాగవంశీలు నిర్మిస్తున్న ఈ సినిమాలో పోలీస్ అధికారిగా వెంకీ నవ్వులు పూయించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus