వెంకటేశ్, నయనతార జంటగా రూపుదిద్దుకుంటున్నచిత్రం ‘బాబు బంగారం. మారుతి దర్శకుడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో విడుదల చేస్తున్నారు. తమిళ్ వెర్షన్ కు ‘సెల్వీ’ అనే టైటిల్ పెట్టారు. ఆగస్టు 12న తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం చెప్పింది.
ఈ మధ్య కాలంలో వెంకీ సినిమాలేవీ తమిళ్ లోకి వెళ్ళలేదు. ఇప్పుడు బాబు బంగారాన్ని అక్కడి తీసుకువెలుతున్నారు. దీనికి కారణం హీరోయిన్ నయనతారే చెప్పుకోవాలి. నయన్ కు మామూలు డిమాండ్ లేదక్కడ. నయన్ సినిమా ఒప్పుకోవడమే సగం విజయంగా భావిస్తున్నారు. ఇప్పుడు హీరోలతో సరిపడే క్రేజ్ నయన్ కు ఉంది. ఇప్పుడీ క్రేజ్ దృష్టిలో పెట్టుకొనే బాబు బంగారాన్ని అక్కడ విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు.