“బాబు బంగారం” రిలీజ్ డేట్ ఖరారు!

  • June 7, 2016 / 01:57 PM IST

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “బాబు బంగారం”. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ నేడు ఉదయం విడుదలై.. విశేషమైన ఆదరణ చూరగొంది. వెంకటేష్ తనదైన శైలిలో “అయ్యో.. అయ్యో.. అయ్యయ్యో..” అని చెప్పిన డైలాగ్ ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకొంది.

దాంతో.. అందరూ “బాబు బంగారం” సూపర్ హిట్ అవ్వడం అని ఫిక్సయిపోయారు. వెంకటేష్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని తొలుత జూలై 1న విడుదల చేద్దామనుకొన్నారు. కానీ.. కారణాంతరాల వలన ఇప్పుడీ చిత్రాన్ని జూలై నెలాఖరుకు పోస్ట్ పోన్ చేశారని తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం “బాబు బంగారం” చిత్రాన్ని జూలై 29న విడుదల చేస్తున్నారట!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus