Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

ఇప్పుడు ‘ఆరెంజ్‌’ సినిమాను చూస్తూ క్లాసిక్‌, కల్ట్‌ లవ్‌ స్టోరీ అనుకునేవాళ్లకు ఒకప్పుడు మెగా ఫ్యాన్స్‌ పడ్డ బాధలు తెలియవు. సినిమా ఫలితం మాట అటుంచితే దాని వల్ల వచ్చిన బ్యాక్‌లాష్‌ చాలా ఇబ్బంది పెట్టింది. ఇదేంటి ప్రేమ గురించి ఇలా చెప్పించారు హీరోతో అని నానా మాటలు అన్నారు. అదే సమయంలో సినిమా టైటిల్‌ గురించి కూడా చర్చ జరిగింది. సినిమా టైటిల్‌ అనౌన్స్‌ చేశాక డిజైన్‌ మార్చిన తొలి సినిమా టైటిల్‌ ఇదే కావొచ్చు. ఈ సినిమా వాలెంటైన్స్‌ డేకి రీరిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో ఆ టైటిల్‌ వెనుక కథను మరోసారి చూస్తే.. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.

Orange

నిజమైన ప్రేమ ఎప్పుడూ ఎక్కువ కాలం ఉండదనే ప్రజెంట్‌ ట్రెండ్‌కి సరిపోతయే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా ‘ఆరెంజ్’. రామ్‌చరణ్‌, జెనీలియా ప్రధాన పాత్రల్లో బొమ్మరిల్లు భాస్కర్‌ తెరకెక్కించిన సినిమా ఇది. అప్పట్లో ఈ సినిమా నిర్మాత నాగబాబుకి రూ.30 కోట్లకు పైగా నష్టాలు తెచ్చిపెట్టింది. ఆస్తులు అమ్ముకుని, దాదాపు దివాళా తీసే పరిస్థితికి చేరుకున్నారాయన. అయితే బ్రదర్స్‌ సాయంతో తిరిగి మామూలు మనిషి అయ్యారు. అయితే ఇప్పుడు ఎప్పుడు రీరిలీజ్‌ చేసినా డబ్బులు, పేరు బాగానే వస్తోంది.

ఆ విషయం పక్కన పెడితే ఇదేం టైటిల్‌ అని అనుకున్నారంతా అప్పుడు. అయితే సినిమా టైటిల్‌ అలా పెట్టడానికి ఉన్న కారణం సినిమాలో సరిగ్గా వివరించలేకపోయారు దర్శకుడు భాస్కర్‌. ఒక రోజులో 24 గంటలు ఉంటే చీకటి 8 నుండి 9 గంటలు ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో ఆకాశం తెల్లగా మారుతుంది. మబ్బులు వస్తే నీలంగా మారుతుంది. సూర్యోదయం సమయంలో, అలాగే సూర్యాస్తమయం సమయంలో ఆకాశం నారింజ రంగులో ఓ పావుగంట ఉంటుంది అనేది టైటిల్‌ వెనుక కథ.

ఆకాశంలో ఆ రంగు లాగే మన జీవితంలో కూడా నిజమైన ప్రేమ కాసేపే ఉంటుంది అనే ఆలోచనతో ఆ పేరు పెట్టారట దర్శకుడు భాస్కర్‌. అయితే ఆ సినిమాలో పాట వల్ల సినిమాను ఓ రేంజ్ లవ్ అని, ఆ రేంజ్ లవ్ అని అనుకున్నారు. అసలు సంగతి ఇదీ.

మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus