వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంత

  • July 6, 2019 / 05:06 PM IST

మధ్యలో వచ్చిన “యూ టర్న్, సీమా రాజా” లాంటి సినిమాలను పక్కన పెడితే.. గత మూడేళ్లలో సమంతకు ఒక్కటంటే ఒక్క పరాజయం కూడా లేదు. “అ ఆ” మొదలుకొని “జనతా గ్యారేజ్, రాజుగారి గది 2, మెర్సల్, రంగస్థలం, మహానటి, అభిమన్యుడు, మజిలీ” వరకూ అన్నీ సూపర్ హిట్సే. ఇక నిన్న విడుదలైన “ఓ బేబీ” సాధిస్తున్న అఖండ విజయాన్ని చూసి నివ్వెరపోతున్నారు ట్రేడ్ విశ్లేషకులు. సినిమాను నందిని రెడ్డి చాలా యావరేజ్ గా తీస్తేనే ఇలా ఆడుతుంటే.. ఇంకాస్త బాగా తీసి ఉంటే సినిమా ఇంక ఏరేంజ్ లో ఆడేదో అని లెక్కలేసుకొంటున్నారు జనాలు.

పెళ్లయ్యాక సినిమాలు మానేయకుండా.. ఇంకాస్త చాలెంజింగ్ రోల్స్ చేస్తూ, మంచి కథలు ఎంచుకోంటూ ముందుకెళ్లడమే సమంత విజయానికి ముఖ్య కారణం. దాంతో పెళ్ళైన తర్వాత సమంత ప్లేస్ కి వచ్చేద్దామనుకొన్న హీరోయిన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇప్పుడప్పుడే సమంతను బీట్ చేసే ఛాన్స్ కానీ.. ఆమె స్థానాన్ని కైవసం చేసుకొనే అవకాశం కానీ సమంత ఎవరికీ ఇచ్చేలా లేదు. ఇకపోతే.. “ఓ బేబీ” సినిమాలో సమంత నటన కంటే ఆమె అల్లరినే లేడీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సమంత కెరీర్ లో ఈ చిత్రం మరో కలికితురాయిలా నిలవడం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus