Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Advertisement

‘రంగబలి’ తర్వాత ఆల్మోస్ట్ 3 ఏళ్ళు గ్యాప్ తీసుకుని యంగ్ హీరో నాగ శౌర్య చేసిన చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ ‘ బ్యానర్ పై శ్రీనివాస్ రావు చింతలపూడి, విజయకుమార్ చింతలపూడి, అశోక్ కుమార్ చింతలపూడి నిర్మించారు.

Bad Boy Karthik

నూతన దర్శకుడు రమేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అనేక కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. హీరో నాగ శౌర్యకి నిర్మాతలకి మధ్య మనస్పర్థలు రావడం వల్ల షూటింగ్ డిలే అయ్యింది.

మొత్తానికి సినిమాని కంప్లీట్ చేసి ఏప్రిల్ 17న రిలీజ్ చేయబోతున్నారు. టీజర్, ట్రైలర్స్ వంటివి ఏమాత్రం ఆసక్తిని క్రియేట్ చేయలేదు. దానికి తోడు మొదటి షోతోనే నెగిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ నిరాశపరిచాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

తెలంగాణ  0.15 cr
సీడెడ్ 0.03 cr
ఆంధ్ర(టోటల్)  0.06 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 0.24 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.01 cr
వరల్డ్ వైడ్ టోటల్ 0.25 cr

బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమాకి రూ.2.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా కేవలం రూ.0.25 కోట్ల షేర్ ను రాబట్టింది. అవి కూడా డెఫిసిట్లు వంటివి తీయకుండా.! అలా చూసుకున్నా .. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా రూ.2.75 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది

ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus