నాగ శౌర్య(Naga Shaurya) నుండి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. 2023 లో వచ్చిన ‘రంగబలి’ తర్వాత అతని నుండి మరో సినిమా రాలేదు. మొత్తానికి ఏప్రిల్ 17న ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రమేష్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.
హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ అయ్యింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ట్రైలర్ లాంచ్ వేడుకను కూడా నిర్వహించారు. ఈ సినిమా షూటింగ్ రెండేళ్ళ క్రితమే మొదలైంది.
కానీ మేకింగ్ ప్రాసెస్ లో హీరోకి నిర్మాతలకి మధ్య మనస్పర్దలు వచ్చినట్టు టాక్ వినిపించింది. అవి ఛాంబర్ వరకు వెళ్ళినట్టు కూడా ప్రచారం జరిగింది. ఈరోజు జరిగిన ఈవెంట్ తో అది నిజమే అనిపిస్తుంది. ఈ ఈవెంట్ కి హీరో నాగశౌర్య హాజరైనప్పటికీ మనస్ఫూర్తిగా హాజరైనట్టు అనిపించలేదు.’బ్యాడ్ బాయ్’ కార్తీక్ నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ… “ఇది మా ఫస్ట్ ప్రొడక్షన్, మా టీమ్ తెలీక కొన్ని తప్పులు చేసి మా హీరోని ఇబ్బంది పెట్టడం జరిగింది. అందుకు నాగ శౌర్య గారు మమ్మల్ని క్షమించండి.
అయినప్పటికీ మీరు మాకు సపోర్ట్ చేసి ప్రమోషన్ కి సహకరిస్తున్నారు. మీతో మళ్ళీ మళ్ళీ పనిచేయాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. అయితే నిర్మాత మాట్లాడినప్పుడు హీరో నాగ శౌర్య ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. కనీసం నిర్మాత మొహం వైపు కూడా చూడలేదు.సాధారణంగా నాగ శౌర్య అలాంటి వ్యక్తి కాదు. చాలా జోవియల్ గా ఉంటాడు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు. కానీ ‘బ్యాడ్ బాయ్’ కార్తీక్ నిర్మాతల విషయంలో మాత్రం అతను బాగా హర్ట్ అయినట్టు ఈ విషయంతో అర్దం చేసుకోవచ్చు.