మున్నా భయ్యా.. తెలుగు ప్రేక్షకులను హర్ట్ చెయ్యబోతున్నాడు..!

  • October 7, 2020 / 05:18 PM IST

ఇప్పటి వరకూ వచ్చిన ‘వెబ్ సిరీస్’ లో ‘మీర్జాపూర్'(హిందీ వెబ్ సిరీస్) ఓ ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. యాక్షన్, రొమాన్స్ తో కూడుకున్న ఈ వెబ్ సిరీస్ తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో ఇన్ని బూతులు ఉన్నాయా అనేంతలా ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ ఉంటుంది. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ లో మున్నా క్యారెక్టర్ బాగా హైలెట్ అయ్యిందని చెప్పొచ్చు. ఫేస్బుక్, వాట్సాప్ లలో ఈ మున్నా క్లిపింగ్స్ ను నెటిజెన్లు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఎట్టకేలకు ఈ వెబ్ సిరీస్ కు సీక్వెల్ కూడా రాబోతుందని అనౌన్స్ చేశారు దర్శకులు కరణ్‌ అన్షుమన్‌, గుర్మీత్‌ సింగ్లు ..! తాజాగా ‘మీర్జాపూర్’ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. మొదటి సీజన్ లో గుడ్డు(అలీ ఫజల్) సోదరుడు బబ్లూ పండిట్(విక్రాంత్) మరియు భార్య స్వీటీ(శ్రియ పిల్గోంకర్)లను మున్నా(దివ్యేందు శర్మ) హత్య చేసే వరకూ చూపించారు.ఇక ‘మీర్జాపూర్ 2’ ట్రైలర్లో గుడ్డు మరియు గోలు (స్వీటీ సోదరి) ఎలా ప్రతీకారం తీర్చుకున్నారనే అంశాలను చూపించారు.

అక్టోబర్ 23న ‘మీర్జాపూర్2’ అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది. అయితే ‘మీర్జాపూర్2’ కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులకు మాత్రం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే సీజన్2 ని తెలుగులో డబ్ చెయ్యడం లేదట. కరోనా కారణంగా సీజన్2 ఆలస్యం అయ్యిందనే ఉద్దేశంతో దర్శకనిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే లేట్ గా అయినా తెలుగు వెర్షన్ ను విడుదల చెయ్యాలని ప్రేక్షకులు కోరుతుండడం విశేషం.

Most Recommended Video

కాబోయే భర్తతో కాజల్… వైరల్ అవుతున్న రేర్ ఫోటోస్!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
‘బిగ్‌బాస్‌’ స్వాతి దీక్షిత్ గురించి మనకు తెలియని నిజాలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus