Pawan Kalyan: ‘హరి హర వీర మల్లు’ బ్యాడ్ సెంటిమెంట్.. టెన్షన్ లో పవన్ ఫ్యాన్స్..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘అబు బాగ్దాద్ గజదొంగ’ … అనే భారీ బడ్జెట్ సినిమా మొదలైంది.1997వ సంవత్సరంలోనే ఈ చిత్రానికి దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్ ను కేటాయించి మొదలుపెట్టారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇదే మొదటి పాన్ ఇండియా మూవీ అయ్యి ఉండేది. ఆ రోజుల్లో చిరు నెంబర్ 1 హీరోగా చలామణి అవుతున్న రోజుల్లో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. హాలీవుడ్లో కూడా ఈ చిత్రాన్ని ఒకేసారి విడుదల చేసేలా ప్లాన్ చేశారు.

చిరుకి ‘మాష్టర్’ వంటి హిట్ ఇచ్చిన సురేష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడిగా ఎంపికయ్యాడు. సినిమా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.కానీ సగం షూటింగ్ పూర్తవ్వగానే కాంట్రవర్సీ ఇష్యూలు తలెత్తడంతో సినిమా ఆగిపోయింది.రాంచరణ్ ‘మగధీర’ పూర్తయ్యాక కూడా ఈ చిత్రాన్ని కంప్లీట్ చేయాలి అని చిరు అనుకున్నారు కానీ సురేష్ కృష్ణ ఫామ్ కోల్పోవడంతో వెనక్కి తగ్గారు. ఎప్పుడో ఆగిపోయిన ఆ ప్రాజెక్టు ప్రస్తావన ఇప్పుడు ఎందుకు? అనే అనుమానం మీకు రావచ్చు.

విషయం ఏంటి అంటే… పవన్ కళ్యాణ్ కూడా ‘హరి హర వీర మల్లు’ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని మొదలుపెట్టాడు. క్రిష్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. కానీ ఈ చిత్రం షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అసలు ఈ చిత్రం కంప్లీట్ అయ్యి విడుదల అవుతుందా అనే అనుమానం అభిమానుల్లో కూడా నెలకొంది. ఈ చిత్రం షూటింగ్ కూడా ‘అబు బాగ్దాద్ గజదొంగ’ ఎలాంటి ముహూర్తానికి మొదలయ్యిందో అలాంటి ముహుర్తానికే మొదలైందట.

‘హరి హర వీర మల్లు’ సినిమా షూటింగ్ కూడా ‘అబు బాగ్దాద్ గజదొంగ’ లా ఆగిపోతుందా అనే బ్యాడ్ సెంటిమెంట్ పవన్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ వరకు ఈ మూవీ ఎప్పుడు వస్తుంది అనే క్లారిటీ రావడం కష్టమని తెలుస్తుంది. నిధి అగర్వాల్ ఈ చిత్రానికి హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Share.