ఘోరంగా మారిన తమన్నా పరిస్థితి!

  • June 27, 2017 / 11:43 AM IST

టాలీవుడ్ లో అందాల భామల రేస్ లో మిల్కీ బ్యూటీ తమన్నా….ఖచ్చితంగా టాప్ లిస్ట్ లో ఉంటుంది. అయితే అందాల ఆరబోతకి మాత్రమే కాకుండా అభినయానికి కూడా మంచి అందాన్ని తెచ్చే అతి కొద్దిమంది అందాల తారల్లో మన మిల్కీ బ్యూటీ ఒకరు. ఇదిలా ఉంటే దాదాపుగా హీరోయిన్స్ అందరూ స్కీం షో మాత్రమే చేస్తారు…కానీ అభినయం విషయంలో ఒక్కసారి ఊసరవెల్లి సినిమాలో తమన్నా యాక్టింగ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఇదిలా ఉంటే అసలు విషయంలోకి వెళితే…అంతటి అందం, అభినయం ఉన్న తమన్నాకి ఇప్పుడు ఇబ్బందులు మొదలయ్యాయి…అసలీ విషయంలోకి వెళితే…బాహుబలి లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన తమన్నాకి ఇప్పుడు తెలుగులో ఒక్క సినిమా కూడా చేతిలో లేకపోవడం నిజంగా ఒప్పుకోలేని నిజం. అయితే అదే క్రమంలో టాలీవుడ్ లో అవకాశం లేకపోవడంతో ఆమె దృష్టి కోలీవుడ్ పై పడి అక్కడ తన హవాను చాటుదామని ప్రయత్నాలు చేసింది. అక్కడ కూడా ఆమె అదృష్టం కలసి రాలేదు.

ఇక చేసేది ఏమీ లేక ప్రస్తుతం తెలుగులో చేయడానికి ఒక్క సినిమా కూడ లేక ఏ మిల్కీ బ్యూటీ…చివరకు టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘పెళ్ళి చూపులు’ తమిళ రీమేక్ లో నటిస్తోంది. అయితే ఇటువంటి పాత్రలు తమన్నాకు సరిపోవు అన్న కామెంట్స్ కోలీవుడ్ మీడియా ఆమె పై చేస్తోంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే…దాదాపుగా మూడు పదులు దాటిపోయినా నయనతారా, అనుష్క, కాజల్ లాంటి హీరోయిన్స్ కు ఇంకా అవకాశాలు రావడమే కాకుండా వారి పారితోషికాలు కోట్లాది రూపాయల స్థాయిలో కొనసాగుతూ ఉంటే చేయడానికి సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న తమన్నా పరిస్థితి చూసి అవకాశాలు ఇచ్చే దర్శక నిర్మాతలు కరువై పోయారు అన్న కామెంట్స్ ఇప్పుడు సినిమా సర్కిల్స్ లో హల్‌చల్ చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తంగా అదీ మ్యాటర్.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus