మన టాలీవుడ్ అంటే ఏంటి…సినిమాలు…షూటింగ్స్…ఆడియో వేడుకలు….బాక్స్ ఆఫీస్ హిట్స్, భారీ వసూళ్లు.. రికార్డు కలెక్షన్స్, ఇలా ఎన్నో ఉన్నాయి మన టాలీవుడ్ లో అయితే ఇదంతా పైపైన మెరుపులే అని…భారీ వసూళ్లు.. రికార్డు కలెక్షన్స్ సాధిస్తున్నారే కానీ…ఆ విషయాన్ని మాత్రం ఏమాత్రం బయటకు రానీయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు అని ఐటీ అధికారులు టాలీవుడ్ పై కన్నేశారు…ఇంతకీ విషయం ఏమిటంటే….తాజాగా మోడి తీసుకున్న సంచలనాత్మక నిర్ణయానికి టాలీవుడ్ ఇబ్బందుల్లో పడింది….సినిమాలు ఆగిపోయాయి…విడుదలయిన సినిమాలకు కలెక్షన్స్ లేవు అనేది నణానికి ఒక వైపు కధ మరో వైపు ఇంకో కోణం ఉంది…సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ను లెక్కల్లోకి చూపడం లేదనే సంగతి ఇన్ కం ట్యాక్స్ వారి దెబ్బకి తేలిసిపోతోంది.
దానికి ఉదాహరణ తాజాగా బాహుబలి నిర్మాతల్లో ఒకరి దగ్గర దాదాపు 60 కోట్ల రూపాయలు పెద్ద నోట్లు దొరికాయనే వార్తలు రావడమే. సినిమాల విషయంలో నిర్మాతలు సొమ్ము చేసుకునే మార్గాలు చాలానే ఉన్నాయి…అయితే అన్ని ప్రాంతాల్లోనూ….భారీ రేట్లకు సినిమాలు అమ్ముతున్నారు…కానీ పన్నులు మాత్రం సరిగ్గా కట్టడం లేదు…పెద్ద సినిమాలు ఓవర్సీస్ హక్కులను భారీ రేట్లకు విక్రయించడం చూస్తూనే ఉన్నా.. ఇందులో కూడా మతలబులు జరుగుతున్నాయని అనుమానిస్తోంది ఈ విభాగం. 10-15 కోట్లకు హక్కులు విక్రయించినా సరే.. పేపర్లపై మాత్రం నామమాత్ర రేట్లతో సరిపెట్టేసి పన్నులు ఎగ్గొడుతున్నారన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా తెలుస్తోంది. ఇక శాటిలైట్ హక్కుల విషయంలో కూడా అదే జరుగుతుంది అన్న అనుమానాలు లేకపోలేదు…ఇలా మొత్తానికి టాలీవుడ్ పై ఐటీ శాఖ ఉక్కుపాదం మోపీ….బ్ల్యాక్ ను బ్లాక్ చేసే పనిలో పడింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.