ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న బాహుబలి కంక్లూజన్ సినిమాలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్ పోషించినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు గుప్పుమన్నాయి. హిందీ లో బిజినెస్ కోసం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి బాద్ షా ని నటింపచేయించినట్లు రూమర్లు చక్కర్లు కొట్టాయి. అయితే ఇందులో వాస్తవం లేదని తేలింది. ఈ వార్తలన్నిటినీ బాహుబలి చిత్ర బృందం కొట్టిపడేసింది. ” మా చిత్రంలో షారుఖ్ ఖాన్ నటించాలని మాకు ఆశ ఉంటుంది. ఆయనతో సినిమా తీయాలని ఎవరికీ మాత్రం ఉండదు. కానీ దురదృష్టవశాత్తు షారూక్ ఖాన్ బాహుబలి 2 లో నటించడం లేదు” అంటూ ఈరోజు బాహుబలి చిత్ర బృందం ట్విట్టర్లో వెల్లడించింది.
దీంతో రూమర్లకు ఫుల్ స్టాప్ పడింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా, రమ్యకృష్ణ, నాజర్ తదితరులు నటించిన ఈ మూవీ ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ వర్క్ జరుపుకుంటోంది. అన్ని హంగులతో ఏప్రిల్ 28 న ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో రిలీజ్ చేయడానికి జక్కన్న బృందం శ్రమిస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.