బాహుబలి కంక్లూజన్ ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్

  • March 11, 2017 / 07:46 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన బాహుబలి కంక్లూజన్ మూవీ ట్రైలర్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మోషన్ పోస్టర్స్ తో అంచనాలు పెంచిన జక్కన్న ట్రైలర్ ద్వారా సినిమా రుచి చూపించబోతున్నారు. ఈ ట్రైలర్ విడుదలపై ఈరోజు రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. మార్చి 16 ఉదయం 9 గంటలకు థియేటర్లలో రిలీజ్ చేస్తామని వివరించారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు సోషల్ మీడియాలో విడుదల చేయనున్నట్లు జక్కన్న ఫేస్ బుక్ లైవ్ లో చెప్పారు.

“బాహుబలి: ది బిగినింగ్” కి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంలో దేవసేన (అనుష్క), శివగామి (రమ్యకృష్ణ) ల మధ్య మంచి ఎమోషనల్ డ్రామా ఉంటుందని డైరక్టర్ వెల్లడించారు. ఎన్నో అంచనాలున్న బాహుబలి 2  ఎటువంటి ఆలస్యం లేకుండా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తుందని నిర్మాతలు స్పష్టం చేశారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus