Akhanda: యూట్యూబ్ లో బాలయ్య రికార్డులు!

  • April 15, 2021 / 07:49 PM IST

నందమూరి బాలకృష్ణ ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరు. ఇప్పటికీ ఆయనకి అభిమానులు లక్షల్లో ఉన్నారు. కానీ ఈ తరువాత హీరోల జోరు ముందు ఆయన నిలవెలకపోతున్నారు. పైగా వరుస ప్లాప్ లు రావడంతో ఆయన సినిమాలపై జనాలకు ఆసక్తి తగ్గింది. యంగ్ హీరోల సినిమాలతో పోలిస్తే.. సోషల్ మీడియాలో బాలయ్య సినిమాల గురించి పెద్దగా చర్చ ఉండదు. యూట్యూబ్ లో బాలయ్య సినిమా ట్రైలర్లు, టీజర్లు విడుదలైనప్పుడు వాటికొచ్చే వ్యూస్, లైక్స్ చాలా తక్కువగా ఉంటాయి. పెద్దగా ట్రెండ్ కూడా కావు.

అయితే బోయపాటి దర్శకత్వంలో బాలయ్య చేస్తోన్న కొత్త సినిమా ‘అఖండ’ మాత్రం దీనికి మినహాయింపనే చెప్పాలి. ఇంతకముందు విడుదలైన ఈ సినిమా ఫస్ట్ రోర్ కి.. తాజాగా విడుదలైన టీజర్ కి ఊహించని స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ లేని విధంగా బాలయ్య సినిమా టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ‘అఖండ’ టైటిల్ రోర్ 24 గంటల్లో 10 మిలియన్ వ్యూస్ ను సాధించింది.

రెండు రోజులు పూర్తయ్యేసరికి 13 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసింది. మూడు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ టీజర్ టాప్ ట్రెండింగ్ లో ఉంది. దీనికి కారణం బాలయ్య-బోయపాటి కాంబినేషన్ అనే చెప్పాలి. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు ‘అఖండ’ అంతకుమించిన సక్సెస్ అందుకుంటుందని నమ్ముతున్నారు.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus