Akhanda Trailer: ‘అఖండ’ బ్లాస్ట్ మాములుగా లేదు!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ‘అఖండ’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టేసింది. ఈ క్రమంలో సినిమా టీజర్, పాటలను విడుదల చేసింది. తాజాగా ట్రైలర్ ను విడుదల చేసి ఫ్యాన్స్ కు మంచి కిక్కించింది ‘అఖండ’ టీమ్. ట్రైలర్ లో బాలయ్య తన విశ్వరూపం చూపించారు.

ట్రైలర్ లో బాలయ్య రెండు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించారు. ఒకటి నార్మల్ గెటప్ కాగా.. రెండోది అఘోరా గెటప్. ట్రైలర్ మొత్తంలో బాలయ్య క్యారెక్టర్ ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసి చూపించారు. అలానే శ్రీకాంత్, జగపతిబాబుల పాత్రలు ఆకర్షిస్తున్నాయి. ఇక డైలాగ్స్ అయితే భీబత్సం..

మచ్చుకు కొన్ని:

”విధికి, విధాతకు, విశ్వానికి సవాళ్లు విసరకూడదు”
”అంచనా వేయడానికి నువ్వేమైనా.. పోలవరం డ్యామా..? పట్టిసీమ తూమా.. పిల్లకాలువ”
”ఒక మాట నువ్వంటే అది శబ్దం.. అదే మాట నేనంటే శాసనం.. దైవశాసనం””మీకు సమస్యం వస్తే దండం పెడతారు.. మేం ఆ సమస్యకు పిండం పెడతాం.. బోత్ ఆర్ నాట్ సేమ్”
”ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకుల్లేని బుల్ డోజర్ ని తొక్కి పారదొబ్బుతా..”

గతంలో బాలయ్య-బోయపాటి కలిసి చేసిన ‘సింహా’, ‘లెజెండ్’ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు వీరి కాంబో హ్యాట్రిక్ అందుకోవడం ఖాయమంటున్నారు అభిమానులు. మిర్యాల రవిందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగపతిబాబు, శ్రీకాంత్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. తమన్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. సీ రాం ప్రసాద్ కెమెరామెన్‌గా, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Share.