Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణతో ఓ సినిమా చేయాలని ప్రముఖ మాస్‌ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ చాలా ఏళ్లుగా అనుకుంటున్నారు. ఆ విషయం బయటకు చెప్పారు కూడా. ఓ సినిమా వేడుకలో బాలకృష్ణ ఎదురుగానే ఈ విషయం చెప్పేశారు. అప్పటి నుండి ఇటు బాలయ్య ఫ్యాన్స్‌, అటువైపు హరీశ్‌ శంకర్‌ ఫ్యాన్స్‌ ఈ కాంబినేషన్‌ గురించి వెయిట్‌ చేస్తున్నారు. బాలయ్య లాంటి మాస్‌ హీరోకు హరీశ్‌ లాంటి మాస్‌ దర్శకుడు కనెక్ట్‌ అయితే వచ్చే కిక్‌ ఎలా ఉంటుందో వారికి తెలుసు కాబట్టి. ఇన్నేళ్ల ‘ఉంటే బాగుండు’ అనే మాట కాస్త.. ‘త్వరలో ప్రారంభం’ అనే మాటకు వచ్చింది అని చెబుతున్నారు.

Balakrishna & Harish

ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా మొదలవ్వాల్సి ఉన్నా ‘అఖండ 2: తాండవం’ ఫలితం ఎఫెక్టో, లేక కథ విషయంలో బాలయ్య పునరాలోచనలో పడటమో కానీ ఆ పని అవ్వలేదు. ఇప్పుడు కథ మారింది అంటున్నారు. ఆ సినిమా ఆలస్యమవుతున్న నేపథ్యంలో తర్వాత చేయబోయే సినిమా కథను ఫైనల్‌ చేశారు అని బాలయ్య సన్నిహితుల టాక్‌. ఆ కథ చెప్పింది హరీశ్‌ శంకర్‌ అని సమాచారం. దీన్ని కుదిర్చింది సితార నాగవంశీ అని టాక్‌.

నాగవంశీ – బాలయ్య కాంబినేషన్‌లో ఇప్పటికే ‘డాకు మహారాజ్‌’ అనే సినిమా వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు హరీశ్‌ శంకర్‌ సినిమాతో మరోసారి ఆ కాంబో కుదరబోతోంది అని సమాచారం. ‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌’ సినిమా పనులు అన్నీ పూర్తి చేసుకొని, రిలీజ్‌ చేసిన తర్వాత బాలయ్య సినిమా పనులు వేగవంతం చేయాలని హరీశ్‌ అనుకుంటున్నారట. ఆ లెక్కన సినిమా మొదలవ్వడానికి చాలా సమయమే పడుతుంది. అయితే కొబ్బరికాయ మాత్రం సమ్మర్‌లో కొడతారని సమాచారం. ఈ ఉగాది సినిమా ప్రకటన ఉంటుంది అని చెబుతున్నారు. చూడాలి మరి ‘డాకు మహారాజ్‌’ విజయం వచ్చినా నాగవంశీ ఆశించిన వసూళ్లు రాలేదని ఓ మాట. ఈసారి ఆ వసూళ్లు కూడా వస్తాయేమో చూడాలి.

‘ఫంకీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus