విశ్వ విఖ్యాత నట సార్వ భౌముడు….స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు….ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా…ఆయన మాట…ఆయన బాట మాత్రం ప్రతీ తెలుగోడి గుండెల్లో ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటుంది…అయితే అదే క్రమంలో ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అంటే…నందమూరి నట సింహం…ఎన్టీఆర్ తనయుడు…టాలీవుడ్ లెజెండ్ బాలయ్య ఇచ్చిన స్టేట్మెంట్ గురించి…విషయంలోకి వెళితే….స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తానని నందమూరి సింహం బాలకృష్ణ ప్రకటించిన విషయం అందరికీ విదితమే…అయితే ఆ వార్త బయటకు వచ్చి ఒక్కరోజు పూర్తి కాకుండానే ఆ వార్త పై స్పందిస్తున్న విమర్శకుల అభిప్రాయాలు అత్యంత ఆసక్తిదాయకంగా మారుతున్నాయి. అయితే ఆ విమర్శలు ఏంటి….ఎందుకలా మాట్లాడుతున్నారు అంటే…ఒక్కసారి ఈ కధ చదవండి…..తెలుగు ప్రజల చరిత్రలో ఎన్టీఆర్ ఖ్యాతి గురించి పేరు ప్రఖ్యాతుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక రకంగా చెప్పాలి అంటే తెలుగు ప్రజల గుండె చప్పుడు ఎన్టీఆర్ ….తెలుగు సినిమా రంగంలో మరో వంద సంవత్సరాలు దాటినా అలాంటి నటుడు మళ్ళీ పుడతాడు అన్న నమ్మకం ఎవరికీలేదు.
అటువంటి మహోన్నత వ్యక్తి జీవితం పైన సినిమా తీయాలి అంటే చాల సాహసం చేయాలి. దీనికి కారణం రామారావు జీవితంలో అనేక సంచలనాలు ఉన్నాయి. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం, ఆ పార్టీ చేసిన ప్రజా పధకాలు…..ఒకటా రెండా….ఇలా చెప్పుకుంటే పోతే ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రభంజనం…అయితే ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీసుకువస్తానని బాలకృష్ణ చేసిన ప్రకటన అత్యంత సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మొదలైపోయింది అని బాలయ్య . అదే క్రమంలో ఈసినిమాలో ఎన్టీఆర్ గురించి ఎవరికీ తెలియని విషయాలు కూడా ఉంటాయని బాలయ్య చెపుతున్నాడు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ జీవితంలో నాణానికి రెండో వైపు ఉన్న ఎన్టీఆర్ రెండో సతీమణి లక్ష్మి పార్వతి పాత్ర ఎలా ఉండబోతోంది.? స్వర్గీయ ఎన్టీఆర్ జీవితం చివరిలో జరిగిన రాజకీయ సునామీ విషయాలను యదార్ధంగా తీయగల సాహసం బాలకృష్ణ చేయగలడా ? ఇలా ఒకటా రెండా ఎన్నో ప్రశ్నల విమర్శలు బాలయ్యకు ఎదురవుతున్నాయి…మరి బాలయ్య వీటన్నింటికి ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.