నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని(Tejaswini Nandamuri) పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఇన్నాళ్లూ కెమెరా వెనుక ఉంటూ, తండ్రి బాధ్యతలు, ఆయన ప్రాజెక్టుల వ్యవహారాలు చక్కబెడుతూ వచ్చిన ఆమె.. ఈ మధ్యనే ఓ యాడ్ లో నటించింది.
తర్వాత ఎక్కడా కనిపించింది లేదు. మళ్ళీ సడెన్‌గా కెమెరా ముందుకు వచ్చి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్‌తో కలిసి తేజస్విని చేసిన ఓ డ్యాన్స్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
ఎప్పుడూ పబ్లిక్ లైఫ్‌లో చాలా సైలెంట్‌గా, సింపుల్‌గా కనిపించే తేజస్విని.. ఈ వీడియోలో వేసిన స్టెప్పులు చూసి బాలయ్య ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆమెలో ఇంత మంచి డ్యాన్సర్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. చాలా గ్రేస్‌తో, పర్ఫెక్ట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఈ స్టార్ కిడ్ డ్యాన్స్ చేసిన తీరుకి అదరహో అంటూ అంతా సోషల్ మీడియాలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.నిజానికి తేజస్వినికి ఇండస్ట్రీ వ్యవహారాలపై మంచి పట్టు ఉంది.
బాలయ్య కొత్త సినిమాల జడ్జిమెంట్‌లో ఆమె కీ రోల్ ప్లే చేస్తుంటారు. ఉదాహరణకు, మొదట కొరటాల శివ చెప్పిన కథ వినడానికి బాలయ్య ఆసక్తి చూపకపోయినా.. తేజస్విని ఒప్పించడంతోనే ఆ ప్రాజెక్ట్ ఓకే అయిందని ఇన్‌సైడ్ టాక్. అలాంటి ఆమె.. ఇప్పుడు ఏకంగా డ్యాన్స్‌తో దుమ్మురేపడంతో, ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిమానులు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.
మరి డ్యాన్స్‌తో అదరగొట్టిన ఈ నందమూరి అందాల కూతురు.. మున్ముందు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందో లేదో తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.