బాలయ్య లుక్ మార్చిన పూరీ!

  • May 12, 2017 / 05:50 AM IST

ఒక పక్క నందమూరి నట సింహం, మరో పక్క డేరింగ్, డాషింగ్ డైరెక్టర్. అసలు ఈ కాంబినేషన్ సెట్ కావడమే సూపర్ అయితే, అదే క్రమంలో ఈ కాంబినేషన్ పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి అటు టాలీవుడ్ లోను, ఇటు అభిమానుల్లోనూ. ఇదిలా ఉంటే ఇప్పటికే టాలీవుడ్ లో తన టాలెంట్ ను నిరూపించుకుని సూపర్ హిట్స్ అందుకున్నాడు పూరీ జగన్నాధ్. ‘ఇడియట్’ చిత్రంతో డైరెక్టర్ గా తన సత్తా చాటిన తర్వాత వరుస హిట్స్ తో దుమ్ము రేపాడు. అంతేకాదు మహేష్ బాబు తో తీసిన పోకిరి చిత్రం అప్పట్లో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేయడంతో ఒక్కసారిగా పూరీ కధ పూర్తిగా మారిపోయింది. ఇక లాస్ట్ యియర్ యంగ్ టైగర్ తో టెంపర్ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న పూరీ, ఇప్పుడు సాక్షాతూ నట సింహంతోనే సినిమా తెరేకెక్కించే చాన్స్ కొట్టేసాడు. మరో పక్క తన 100వ చిత్రం చరిత్రలో నిలిచిపోయేలా ప్లాన్ చేసుకుని, భారీ హిట్ అందుకుని, చరిత్ర సృష్టించిన బాలయ్య సైతం మంచి ఒప్పు మీద ఉన్నాడు.

అయితే అసలే పూరి చిత్రాలు చాలా డిఫరెంట్ మోడ్ లో ఉంటాయి, మాస్, క్లాస్,మాఫియా కూడా ఉంటుంది. ఇప్పుడు బాలకృష్ణతో తీస్తున్న చిత్రంలో బాలయ్య ఎలా ఉంటాడో ? బాలయ్య ని పూరి ఎలా చూపిస్తాడో అని ఆశగా ఎదురు చూస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్. మరి వారి ఆశలకు తగ్గట్టుగానే, వారి ఎక్స్‌పెక్టేషన్స్ కి అందుకునే లాగానే బాలయ్యను చూపిస్తున్నాడట పూరీ. ఇక అదే క్రమంలో ఆన్‌లైన్ లో బాలయ్య సైతం అంతే కిక్ ఇచ్చే లుక్ తో కనిపిస్తున్నాడని చెబుతున్నారు ఆన్‌లైన్ యూసర్స్, దానికి కారణం ఏంటి అంటే, తాజాగా బాలయ్య ఓ అభిమాని తో దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అట.  శాతకర్ణి కోసం పెంచిన మీసం అలాగే ఉంచాడు బాలయ్య దానికి కొనసాగింపు గా గడ్డం ని పెంచాడు దాంతో రెంటికి బాగానే సరిపోయింది. మొత్తంగా చూసుకుంటే బాలయ్య లుక్ చాలా పవర్‌ఫుల్ గా ఉంటుంది అని ఇట్టే అర్ధం అవుతుంది. చూడాలి మరి సెప్టెంబర్ లో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus