షూటింగ్ లో గాయపడ్డ బాలయ్య!!!

Advertisement

“అమరావతి”ని పాలించిన శాతవాహనుల రాజు కధ ఆధారంగా నందమూరి నట సింహం బాలకృష్ణ తన వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బాలయ్య కరియర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీగా తెరకెక్కుతుంది ఈ చిత్రం…అదే క్రమంలో మొన్నటిదాకా మొరాకొలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన చిత్రయూనిట్ రెండో షెడ్యూల్ ను… హైదరాబాద్ చిలుకూరు బాలాజి టెంపుల్ సమీపంలో షూటింగ్ జరుపుకుంటున్నారు. అయితే ఈ షూటింగ్ లో భాగంగా బాలయ్య గాయపడినట్లు సమాచారం అందుతుంది…భారీ యుద్ధ సన్నివేశాలతో కూడినా ఈ ఎపిసోడ్ లో బాలయ్య గుర్రం మీద నుండి కింద పడినట్లు తెలుస్తుంది. మరో పక్క పెద్దగా భయపడవలసిన పని లేదు అని… చిన్నపాటి గాయాలే తప్ప ప్యాక్చర్లు ఏమి కాలేదట..

బాలయ్య గుర్రంపై స్వారి చేస్తూ ఫైట్ చేస్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది అని చిత్ర యూనిట్ చెబుతున్నారు. అభిమానుల కోసం బాలయ్య పడుతున్న తపన అంతా ఇంతా కాదు అని మరోసారి ఋజువు అయ్యింది…..ఇక ఎట్టి పరిస్థితుల్లో వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం. మరి ఈ సినిమా బాలయ్య కష్టానికి తగిన ఫలితం అందిస్తుందో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus