ఆయన అటెండ్ అయ్యింది వేరే ఫంక్షన్, వీళ్ళు అనుకొన్నది ఒక ఫంక్షన్

  • October 11, 2019 / 05:30 PM IST

నిన్న సాయంత్రం నుండి సోషల్ మీడియాలో ఒకటే రచ్చ.. బాలయ్య “సైరా” సినిమా అభినందన సభకు వచ్చాడని, చిరంజీవిని ప్రశంసించాడని ట్వీట్లు, పోస్టులు భీభత్సంగా హల్ చల్ చేస్తున్నాయి. అయితే.. అక్కడ నిజానికి నందమూరి బాలకృష్ణ మరియు వెంకటేష్ లు అటెండ్ అయ్యింది.. దర్శకుడు కోడి రామకృష్ణ ఇంట జరిగిన ఒక పెళ్లి వేడుకకు వారిద్దరూ హాజరయ్యారు. అదే వేడుకకు చిరంజీవి కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అదే హోటల్లో నిన్న సైరా అభినందన సభ కూడా జరిగి ఉండడంతో.. అందరూ బాలయ్య, వెంకటేష్ కూడా ఈ ఈవెంట్ కి వచ్చేశారని సంబరపడిపోయారు. ముఖ్యంగా మెగా అభిమానులైతే.. తమకు నందమూరి అభిమానుల సపోర్ట్ కూడా దొరుకుతుంది అనుకొన్నారు.

కట్ చేస్తే.. వాళ్ళు వచ్చింది సైరా అభినందన సభకు కాదని, చిరంజీవి పక్కన బాలయ్య కూర్చున్న ఫోటో కోడి రామకృష్ణ గారి పెళ్లి సందడిలోనిదని తెలిసేసరికి మాత్రం అందరూ షాక్ అయ్యారు. కేవలం ఒక ఫోటో & వెన్యూ కన్ఫ్యూజన్ వల్ల ఇంత గందరగోళం క్రియేట్ అవ్వడం అనేది ఎవరికీ నచ్చలేదు. ఫై.ఆర్ టీమ్ ఈ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించి, వెంటనే డౌట్స్ క్లియర్ చేసి ఉంటే బాగుండేది.

1

2

3

4

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus