Balakrishna: 2 క్రేజీ ప్రాజెక్టులు మిస్ చేసుకున్న బాలయ్య.. షాకింగ్ ఇది!

స్టార్ హీరోలు కొన్ని సినిమాలకు నో చెప్పడం ఇండస్ట్రీలో కామనే. కానీ ఆ సినిమాలు బ్లాక్‌ బస్టర్ ప్రాజెక్టులైతే, ఆ న్యూస్ హాట్‌ టాపిక్ అవుతుంది. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ విషయంలోనూ అదే జరిగింది. ఆయన ఏకంగా రెండు భారీ సినిమాలను రిజెక్ట్ చేశారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సినిమాలు ఏంటో చూద్దాం.మొదటిది ఆంధ్రా కింగ్ తాలూకా . ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఇది. ఈ సినిమాలో రామ్, ఓ సూపర్ స్టార్‌కు వీరాభిమానిగా కనిపించనున్నాడు.

Balakrishna

ఆ సూపర్ స్టార్ ‘సూర్య కుమార్’ పాత్రను ప్రస్తుతం కన్నడ స్టార్ ఉపేంద్ర పోషిస్తున్నారు. అయితే, ఈ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ బాలకృష్ణ అట. మేకర్స్ మొదట బాలయ్యను సంప్రదించగా, కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి చూపలేదని సమాచారం. దాంతో ఆ క్రేజీ రోల్ ఉపేంద్ర చేతికి వెళ్లింది. ఇక రెండో సినిమా మరేదో కాదు, సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ఇండస్ట్రీ ‘జైలర్’. ‘జైలర్’ (పార్ట్ 1) మేకింగ్ టైమ్‌..లోనే బాలయ్యను ఓ కీలక పాత్ర కోసం అనుకున్నారట. కానీ ఆ ప్లాన్ వర్కవుట్ కాలేదు.

రజనీ హీరోగా వచ్చిన ఈ సినిమా 2023లో విడుదలై, ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది.ఇప్పుడు ‘జైలర్ 2’ కోసం మేకర్స్ మళ్లీ బాలయ్యతో చర్చలు జరిపారు. 20 నిమిషాల పాత్రకు రూ.20 కోట్లు ఆఫర్ చేశారు.మొదట ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా టాక్ నడిచింది. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ ప్లాన్ కూడా ముందుకు సాగలేదని తెలుస్తోంది. రజనీకాంత్ హీరోగా ‘జైలర్ 2’ 2026, జూన్ 12న విడుదల కానుంది.

 కమల్ బర్త్ డే రోజున రజిని ఫ్యాన్స్ కు ట్రీట్!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus