హిందూపురంలో బుల్లెట్ ఫై పర్యటించిన బాలకృష్ణ

  • June 23, 2017 / 01:55 PM IST

బుల్లెట్ నడుపుతున్న బాలకృష్ణను సినిమాల్లో అందరూ చూసారు. అది హీరో నైజం. ఎమ్మెల్యేగాను బాలయ్య బుల్లెట్ నడిపి ఉత్సాహం నింపారు. మొన్నటి వరకు పైసా వసూల్ చిత్రీకరణ నిమిత్తం పోర్చుగల్ ల్లో ఉన్న బాలయ్య రీసెంట్ గా హైదరాబాద్ కి వచ్చారు. ఇక్కడికి వచ్చిన వెంటనే తన నియోజక వర్గంలో ప్రజల బాగోగుల గురించి పట్టించుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఈరోజు బాలకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా అభిమానులతో కలిసి బుల్లెట్‌ నడిపారు. ఈ ఉదయం చిల్లమత్తూరుకు చేరుకున్న బాలయ్యకు తెదేపా శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికాయి.

అభిమానుల కేరింతల మధ్య అక్కడి నుంచి బుల్లెట్‌పై ర్యాలీగా హిందూపురానికి చేరుకున్నారు. అనంతరం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీతతో కలిసి బాలయ్య పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus