‘బాలకృష్ణుడు’తో రోహిత్ కు పూర్వ వైభవం!

  • November 18, 2017 / 01:12 PM IST

మంచి నటుడే అయినప్పటికీ సరైన హిట్ లేక యువ కథానాయకుల రేస్ లో నిలవలేకపోతున్న కథానాయకుడు నారా రోహిత్. “బాణం, సోలో, ప్రతినిధి” తప్పితే కెరీర్ లో మరో హిట్ లేని నారా రోహిత్ ఏడాదికి ఏడెనిమిది సినిమాలకు పైనే నటిస్తుండడం విశేషం. కానీ.. బాడీపై కంట్రోల్ లేకపోవడం, మరీ బొద్దుగా కనిపించడం వంటి కారణాల వలన రోహిత్ ను హీరోగా కన్సిడర్ చేసేవాళ్ళ లిస్ట్ రోజురోజుకీ తగ్గిపోయేది. అలాంటి తరుణంలో కాన్సెప్ట్ మూవీస్ ను కాక కమర్షియల్ సినిమాలపై దృష్టిసారించాడు నారా రోహిత్. అందుకే పవన్ మల్లెల దర్శకత్వంలో తెరకెక్కిన “బాలకృష్ణుడు” అనే చిత్రంతో మనోడు మాంచి హిట్ అందుకోబోతున్నాడని ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్ టాక్.

కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం నవంబర్ 24న విడుదలవుతోంది. నారా రోహిత్ సరసన రెజీనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకకు సమంత, సాయిధరమ్ తేజ్ వంటి స్టార్లు విచ్చేయడంతో సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మరి ఈ సినిమా హిట్ అయ్యి నారా రోహిత్ కి పూర్వ వైభవం తీసుకురాగలుగుతుందో లేదో తెలియదు కానీ.. ఇప్పటివరకూ నారా రోహిత్ నటించిన ఏ సినిమాకీ రాని స్థాయిలో “బాలకృష్ణుడు”కు పాజిటివ్ టాక్ రావడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus