Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ఆదిశేష‌న్ (చైల్డ్ యాక్ట‌ర్‌), టోవినో థామ‌స్‌ (Hero)
  • ఫ‌ర్జానా ప‌ల‌థింగ‌ల్‌ (Heroine)
  • మ‌హ్మ‌ద్ జినాన్‌, జీన్ పాల్ లాల్ త‌దిత‌రులు (Cast)
  • చిదంబ‌రం (Director)
  • వెంక‌ట్ కే నారాయ‌ణ‌, శైల‌జ దేశాయ్‌ (Producer)
  • సుషీన్ శ్యామ్ (Music)
  • సైజు ఖ‌లీద్ (Cinematography)
  • వివేక్ హ‌ర్ష‌న్‌ (Editor)
  • Release Date : 19th జూన్ 2026
  • కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్‌ (Banner)

మంజుమ్మ‌ల్ బాయ్స్ మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో క‌ల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద భారీగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత డైరెక్ట‌ర్ చిందంబ‌రం తెర‌కెక్కించిన లేటెస్ట్ మూవీ బాల‌న్ ది బాయ్‌. స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ మూవీలో ఫ‌ర్ణానా ఫ‌ల‌థింగ‌ల్‌, ఆదిశేష‌న్‌, టోవినో థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించిన ఈ మ‌ల‌యాళ సినిమాను తెలుగులో అన్న‌పూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేసింది. బాల‌న్ మూవీ ఎలా ఉంది? మ‌రోసారి థ్రిల్ల‌ర్ క‌థ‌తో ద‌ర్శ‌కుడు చిదంబ‌రం ఆడియెన్స్‌ను మెప్పించాడా? అంటే?

Balan The Boy Movie Review

క‌థ‌: ఇందు (ఫ‌ర్జానా) హ‌త్య కేసులో ప్రెగ్నెంట్‌గా ఉన్న‌ప్పుడు జైలుకు వెళుతుంది. శిక్ష‌కాలం పూర్తిచేసుకొని త‌న కొడుకు వ‌సుదేవ‌న్ తో (ఆదిశేష‌న్‌) క‌లిసి జైలు నుంచి విడుద‌ల‌వుతుంది. త‌మ గ‌తం గురించి ఎవ‌రికి తెలియ‌ని చోటుకు వెళ్లి కొడుకుతో క‌లిసి ప్ర‌శాంతంగా బ‌త‌కాల‌ని అనుకుంటుంది. షెర్లీ, వంద‌న‌, మేరీ ఇలా మారు పేర్ల‌తో అనేక చోట్ల ఉద్యోగాలు చేస్తుంది. ఎలాంటి బంధాలు, బంధుత్వాలు క‌లుపుకోకూడ‌ద‌ని ఇష్ట‌ప‌డ‌దు. చివ‌ర‌కు అట‌వీ ప్రాంతానికి ద‌గ్గ‌ర‌లో ఉన్న ఊరిలో ఓ వృద్ధురాలికి కేర్ టేక‌ర్‌గా ఉండ‌టానికి వ‌స్తుంది.

ఇందు క‌ష్టాలు తెలుసుకున్న ఆ వృద్ధురాలు ఆమెతో పాటు కొడుకు వ‌సుదేవ‌న్‌ను అక్క‌డే ఉండ‌మ‌ని కోరుతుంది. కొడుకు ఓ స్కూల్‌లో చేర్పిస్తుంది ఇందు. అనుకోని ప‌రిస్థితుల్లో ఇందు మ‌రో హ‌త్య చేస్తుంది? ఆ సంఘ‌ట‌న కార‌ణంగా త‌ల్లికి వ‌సుదేవ‌న్ దూర‌మ‌వుతాడు. ఆ త‌ర్వాత ఏమైంది? త‌ల్లికి దూర‌మైన వ‌సుదేవ‌న్ క్రిమిన‌ల్ అబ్బాస్ (టోవినో థామ‌స్‌) ద‌గ్గ‌ర‌కు ఎలా చేరాడు? వ‌సుదేవ‌న్ కార‌ణంగా పోలీస్ ఆఫీస‌ర్ ప‌విత్ర‌న్ తన ప్రియురాలికి ఎలా దూర‌మ‌య్యాడు? వ‌సుదేవ‌న్ ఎప్ప‌టికీ త‌న త‌ల్లిని క‌ల‌వ‌కుండా ప‌విత్ర‌న్ ఎలాంటి కుట్ర‌లు ప‌న్నాడు అన్న‌దే బాల‌న్ ది బాయ్ మిగిలిన క‌థ‌.

న‌టీన‌టుల ప‌నితీరు: బాల‌న్ మూవీ క‌థ చాలా వ‌ర‌కు ఫ‌ర్జానా ప‌ల‌ధింగ‌ల్‌, ఆదిశేష‌న్ పాత్ర‌ల చుట్టూనే తిరుగుతుంది. త‌ల్లీకొడుకులుగా ఇద్ద‌రూ అద్భుత న‌ట‌న‌ను క‌న‌బ‌రిచారు. కొడుకే ప్ర‌పంచంగా బ‌తికే త‌ల్లిగా ఎమోష‌న‌ల్ రోల్‌కు ఫ‌ర్జానా పూర్తిగా న్యాయం చేసింది. ఆదిశేష‌న్ డైలాగ్స్‌తో కాకుండా త‌న క‌ళ్లు, ఎక్స్‌ప్రెష‌న్స్‌తోనే చ‌క్క‌టి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. మ‌ల‌యాళ హీరో టోవినో థామ‌స్ ఎక్కువ నిడివితో కూడిన గెస్ట్ రోల్ చేశారు. క్రిమిన‌ల్‌గా మాస్ ఆటిట్యూడ్‌, బాడీలాంగ్వేజ్ బాగుంది. కానీ పాత్ర‌కు స‌రైన ప్రాధాన్యం లేదు. వ‌సుదేవ‌న్ టీనేజ్ రోల్‌లో మ‌హ‌మ్మ‌ద్ జినాన్ స‌రిగ్గా సెట్ కాలేదు.

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: కంప్లీట్ క‌మ‌ర్షియ‌ల్ థ్రిల్ల‌ర్‌లా తెర‌కెక్కించే స్కోప్ బాల‌న్‌ క‌థ‌లో ఉంది. కానీ ద‌ర్శ‌కుడు మాత్రం తాను అనుకున్న క‌థ‌ను నిజాయితీగా స్క్రీన్‌పై చూపించాడు. త‌ల్లీకొడుకుల బాండింగ్‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాడు. జీతూ మాధ‌వ‌న్ రాసుకున్న బాగుంది. సైజు ఖ‌లీద్ సినిమాటోగ్ర‌ఫీ, సుషీన్ శ్యామ్ బీజీఎమ్ బాల‌న్‌కు ప్రాణం పోశాయి.

విశ్లేష‌ణ‌: మ‌ల‌యాళం ఇండ‌స్ట్రీ థ్రిల్ల‌ర్ సినిమాల‌కు పెట్టింది పేరు. ఊహ‌ల‌కు అంద‌ని ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో మ‌ల‌యాళ థ్రిల్ల‌ర్ సినిమాలు ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేస్తుంటారు. బాల‌న్‌ కూడా స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ సినిమా అంటూ మేక‌ర్స్ ప్ర‌చారం చేశారు. ఆ అంచ‌నాల‌తో థియేట‌ర్‌కు వెళితే మాత్రం బాల‌న్ పూర్తిగా డిస‌పాయింట్ చేస్తుంది. కంప్లీట్ ఆర్ట్ సినిమా మాదిరిగా పొయేటిక్ వేలో ద‌ర్శ‌కుడు చిదంబ‌రం ఈ సినిమాను రూపొందించారు. ప్ర‌పంచంలో త‌ల్లికి మించిన యోధురాలు లేద‌ని కేజీఎఫ్ సినిమాలో య‌శ్ చెప్పిన డైలాగ్ ఈ సినిమాను చూస్తే గుర్తొస్తుంది.

త‌న కొడుకుకు అంద‌మైన భ‌విష్య‌త్తును ఇవ్వాల‌ని ఆరాట‌ప‌డే ఓ త‌ల్లి పోరాటాన్ని త్యాగ‌ల‌ను మ‌నుసుల‌కు హ‌త్తుకునేలా చూపించారు. దూర‌మైన త‌ల్లిని క‌ల‌వ‌డం కోసం ఓ కొడుకు ప‌డే త‌ప‌న‌ను అంతే ఎమోష‌న‌ల్‌గా ఈ సినిమాలో ఆవిష్క‌రించారు. ఈ అంశాల చుట్టే చివ‌రి వ‌ర‌కు బాల‌న్ సాగుతుంది. ఈ క‌థ‌లోనే అంత‌ర్లీనంగా రివేంజ్ డ్రామాను, క్రైమ్ దందాల‌ను చూపించారు. కానీ అవ‌న్నీ సినిమా నిడివి పెంచ‌డానికే ఉప‌యోగ‌ప‌డ్డాయి. మ‌ల‌యాళ సినిమాలు చాలా వ‌ర‌కు షాకింగ్ క్లైమాక్స్‌ల‌తోనే సాగుతాయి. ఇందులో బాల‌న్‌లో ఎండింగ్ ట్విస్ట్ అదిరిపోతుంది.

ఈ సినిమాకు ర‌న్‌టైమ్ బిగ్గెస్ట్ మైన‌స్‌. చాలా స్లోఫేజ్‌లో ఈ సినిమా సాగుతుంది. అంత సాగ‌తీత‌ను తెలుగు ఆడియెన్స్ భ‌రించ‌డం క‌ష్ట‌మే. టోవినో థామ‌స్ మిన‌హా పేరున్న యాక్ట‌ర్లు కూడా ఎవ‌రూ లేరు.

ఫోక‌స్ పాయింట్‌: బాల‌న్ మ‌ల‌యాళ మార్కు వైర‌టీ థ్రిల్ల‌ర్ మూవీ. ఓపిక‌గా చూస్తే డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియ‌న్స్‌ను ఇస్తుంది. క‌మ‌ర్షియ‌ల్ మూవీ ల‌వ‌ర్స్ మాత్రం బాల‌న్‌ను భ‌రించ‌లేరు.

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus