క్యూట్‌గా ఉన్న ఈ పిల్లాడిని గుర్తు పట్టారా.. తెలుగు ఇండస్ట్రీలో టాప్ స్టార్.. వైరల్ అవుతున్న ఫోటో..!

  • February 16, 2023 / 11:16 AM IST

సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్నప్పటి పిక్స్, రేర్ ఫోటోస్, అన్‌సీన్ ఇమేజెస్, వీడియోస్ లాంటివి వైరల్ అవుతుంటాయి.. అరే.. మన స్టార్స్ చిన్నప్పుడు భలే ముద్దుగా ఉన్నారే అంటూ ఆశ్చర్యపోతుంటారు నెటిజన్లు.. ఇప్పుడలానే ఓ బిగ్ స్టార్ ఛైల్డ్ హుడ్ పిక్చర్ ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది..

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని చూశారా?.. అచ్చు హాలీవుడ్ హీరోలా ఉన్నాడు కదా.. కానీ కాదు.. మన టాలీవుడ్ హీరోనే.. క్లూ కావాలంటే.. గత నాలుగు దశాబ్దాలుగా తండ్రి నట వారసత్వాన్ని, ఆ తర్వాత రాజకీయ, సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తూ.. అసలు సిసలు వారసుడు అనిపించుకున్నాడు.. గుర్తొచ్చింది కదూ.. ఎస్.. ఆయనే నటసింహ నందమూరి బాలకృష్ణ..

బాలయ్య చిన్నప్పుడు ఫ్యామిలీతో ఉన్న ఫోటోలు, బాలనటుడిగా నటించినప్పటి పిక్స్ చాలానే వచ్చాయి కానీ ఇది మాత్రం ఎక్కడా కనిపించలేదంటున్నారు ఫ్యాన్స్, ఆడియన్స్.. దీంతో ఈ రేర్ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు.. ‘‘చూడ్డానికి బొమ్మలా భలే ఉన్నాడు బుజ్జి బాలయ్య.. చిన్నప్పటి ముద్దుల బాలకృష్ణుడు.. పెద్దయ్యాక జై బాలయ్య అనిపించుకుంటున్నాడు’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus