నాగబాబుకి కౌంటర్ ఇచ్చిన నందమూరి అభిమానులు..!

తాజాగా మెగా బ్రదర్ నాగబాబుకి ఊహించని షాకిచ్చారు బాలయ్య ఫ్యాన్స్. వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని ఓ కాలేజ్ లో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు నాగబాబు. స్టేజీ పై నుండీ నాగబాబు స్టూడెంట్స్ తో ప్రసంగిస్తుండగా… కొందరు బాలయ్య బాబు అభిమానులు ఒక్కసారిగా “జై బాలయ్యా.. జై బాలయ్యా” అంటూ బిగ్గరగా అరిచారు. నాగబాబు ప్రసంగిస్తున్నంతసేపు బాలయ్య బాబు అభిమానులు అరుస్తూనే ఉండడం సంచలనంగా మారింది. ఈ విషయంతో బాలయ్య అభిమానుల పై నాగబాబు అసహనాకి గురయ్యినట్టు తెలుస్తుంది.

ఈమధ్య కాలంలో నాగబాబు ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో… బాలయ్య బాబు ఎవరో నాకు తెలీదంటూ జవాబిచ్చాడు నాగబాబు. ఇక అక్కడితో ఆగకుండా కమెడియన్ బాలయ్య నాకు తెలుసంటూ.. వివాదాలకు తెరలేపాడు. ఈ విషయం పై బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో నాగబాబు పై ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ… నాగబాబు మాత్రం బాలయ్యను టార్గెట్ చేయడం ఆపలేదు. అక్కరికి ‘ఎన్టీఆర్ బయోపిక్’ పై కూడా తన శైలిలో కామెంట్స్ చేసాడు నాగబాబు. ఈ కారణాల రీత్యా ఇలా నాగబాబును.. బాలయ్య అభిమానులు టార్గెట్ చేసినట్టు స్పష్టమవుతుంది. ఇక ఈ విషయం పై నాగబాబు ఎలా స్పందిస్తాడో చూడాలి మరి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus