నిన్న విడుదలైన సినిమాల ఓపెనింగ్స్ పరిస్థితి..?

  • December 21, 2019 / 11:31 AM IST

నిన్న అంటే.. డిసెంబర్ 20న నాలుగు క్రేజీ సినిమాలు విడుదల అయ్యాయి. అన్ని చిత్రాలకి డీసెంట్ టాక్ వస్తుంది. నందమూరి బాలకృష్ణ ‘రూలర్’ చిత్రం మాస్ ప్రేక్షకులకి బాగా నచ్చే అవకాశం ఉండనే రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక సాయి తేజ్ ‘ప్రతీరోజు పండగే’ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని.. ఇక కార్తీ ‘దొంగ’ సస్పెన్స్ థ్రిల్లర్ అని.. అలాగే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ‘దబంగ్3’ కూడా మాస్ ప్రేక్షకులని అలరించేలా ఉందని తెలుస్తుంది.

సరే ఇక ఓపెనింగ్స్ ఎలా ఉండొచ్చు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మాస్ సెంటర్స్ లో ఈ చిత్రం బుకింగ్స్ అదిరిపోతున్నాయి. క్లాస్ సెంటర్స్ లో కూడా బాగానే బుకింగ్స్ జరుగుతున్నట్టు ట్రేడ్ పండితుల సమాచారం. దీంతో ‘రూలర్’ మొదటి రోజు 4.5 కోట్ల వరకూ షేర్ ను రాబట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ‘ప్రతీరోజూ పండగే’ చిత్రానికి కూడా క్లాస్, మాస్ రెండు ఏరియాల్లోనూ బుకింగ్స్ బాగున్నాయి. ఈ చిత్రానికి కూడా 3 నుండీ 3.5 కోట్ల వరకూ షేర్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక ‘దొంగ’, ‘దబంగ్3’ చిత్రాలకి కూడా 0.50 కోట్ల వరకూ షేర్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

రూలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రతిరోజూ పండగే సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus