బాలయ్య మైండ్ బ్లాక్ అయ్యింది!!!

సహజంగా నందమూరి బాలయ్య అంటే టాలీవుడ్ లో అందరికీ ఎంత గౌరవరమో అంతే  భయం కూడా. టాలీవుడ్ లో ఎంత మంది మగధీరులు ఉన్నా బాలయ్య స్థానం ఎంతో ప్రత్యేకం. తన పవర్ ఫుల్ యాక్షన్ తో అందరికీ ఆకట్టుకునే బాలయ్య నిన్న జరిగిన ‘నాయకి’ సినిమా ఆడియో లాంచ్ లో ఆ సినిమా కధానాయిక త్రిష తీరు పట్ల కాస్త కంగారు పడ్డాడు. ఇంతకీ విషయం ఏంటంటే…త్రిష ముఖ్య భూమిక పోషిస్తున్న ‘నాయకి’ సినిమా ఆడియో వేడుకలో త్రిష తన అందాలతో అందరికీ వేడెక్కించింది. తన గ్లామర్ ఎక్స్ పోజింగ్ తో ఆడియో ఫంక్షన్ కు వచ్చిన వారి అందరి మైండ్ బ్లాంక్ చేసింది.

బహుశా హీరోయిన్స్ కాంపిటేషన్ ఎక్కువ కావడం, పైగా సీనియర్ నటిగా ఉండడం వల్ల అవకాశాల జోరు తగ్గకుండా ఇలా హాట్ హాట్ గా దర్శనం ఇస్తుందేమో. ఇదిలా ఉంటే ఈ ఫంక్షన్ కు అతిధిగా వచ్చిన బాలకృష్ణకు ఏకంగా ఓపెన్ లిప్ లాక్ ఇచ్చిన విధంగా ఆమె ఇచ్చిన పోజులు మీడియాకు సైతం సెన్సార్ కట్ చెప్పాలా అనిపెించేలా ఉన్నాయి. ఇక ఈ వేడుకలో ఆమె వేసిన డ్రెస్ విషయమే తీసుకుంటే చూసినవాళ్లకు మతులు పోయాయి. ఇంకా చెప్పాలి అంటే ఇప్పటివరకూ ఎప్పుడూ కనిపించనంత గ్లామర్ డోస్ తో కంప్లీట్ క్లీవేజ్ షో చేసేస్తూ విండో డ్రెసింగ్ తో అదరగొట్టేసింది సెక్సీ బ్యూటీ త్రిష. ఇక ఈ వేడుకలో బాలయ్య మాట్లాడుతూ త్రిషపై శెటైర్స్ వేశారు…లేడీ ఓరియంటడ్ సినిమాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందిఅని అంటూనే త్రిష తన బాడీ లాంగ్వేజ్ ను ఈసినిమాలో ఇమిటేట్ చేసినట్లుగా ఉంది అని ఆయన అన్నారు. ఇలా ఆధ్యాంతం అందాల ఆరబోతతో, బాలాయ్య హాస్యంతో నిండింది ఆ వేదిక.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus