‘సైరా’ టీం ను ప్రశంసలతో ముంచెత్తిన బాలయ్య..!

  • October 10, 2019 / 07:21 PM IST

సినీ ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ ఎప్పుడూ ఉంటుంది. అయితే అది ఆరోగ్యకరమైన పోటీనే అని అందరూ గుర్తించాలి. పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే కలెక్షన్లు, రికార్డులు అంటూ అభిమానులు కలర్ ఎగరేసుకోవడం, అలాగే పోటీ ఉన్న హీరోల అభిమానుల కలర్లు పట్టుకోవడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. అయితే అదంతా మంచి పరిణామం కాదు. ఇప్పట్లో హీరోల సినిమాల కలెక్షన్లతో కొట్టుకోవడం కాదు. మన హీరోలు ఇతర ఇండస్ట్రీ సినిమాలను మించి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫాన్ వార్స్ అనేవి సరైనవి కావు అనడంలో సందేహం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ హీరో సినిమా సక్సెస్ అయితే ఆ సక్సెస్ పార్టీలో పాల్గొని అభినందించడానికి రెడీ అవుతున్నారు మన టాలీవుడ్ హీరోలు.

ఇక అసలు విషయం ఏమిటంటే.. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంతో సక్సెస్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవిని అభినందించాడనికి నందమూరి బాలకృష్ణ ముందుకు రావడం అందరినీ ఆకర్షించే అంశం. మెగాస్టార్ చిరంజీవితో పాటు, దర్శకుడు సురేందర్ రెడ్డిని, అలాగే నిర్మాత రాంచరణ్ ను ఆయన అభినందించారు. టి.సుబ్బరామిరెడ్డి ‘సైరా’ టీంకు ఇచ్చిన సక్సెస్ పార్టీకి బాలకృష్ణ, వెంకటేష్ లు హాజరయ్యి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘సైరా’ సినిమా చూసిన బాలయ్య ఆ టీం పై ప్రశంసలు కురిపించడం విశేషం. ప్రస్తుతం ఈ టాపిక్ పైనే ఫిలింనగర్లో చర్చ జరుగుతుంది. ఏదేమైనా టాలీవుడ్ లో ఇది మంచి పరిణామం అనే చెప్పాలి..!

1

2

3

4

ఎవ్వ‌రికీ చెప్పొద్దు సినిమా రివ్యూ & రేటింగ్!
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus