ఎన్టీఆర్ జీవిత చరిత్రపై సినిమా నిర్మాణం విరమించుకున్న బాలయ్య

  • August 10, 2017 / 12:17 PM IST

మహా నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జీవిత చరిత్రపై సినిమాను తీయాలని ఆయన తనయుడు నటసింహ నందమూరి బాలకృష్ణ కలలుకన్నారు. తండ్రి గురించి తెలియని అనేక విషయాలను తెలుగు ప్రజలకు తెలియ చెప్పాలని ఆశపడ్డారు. తండ్రి పాత్రలో తానే నటిస్తున్నట్లు, సొంతంగా ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు మూడు నెలల క్రితం ప్రకటించారు. అంతేకాదు బయోపిక్ చిత్రాల స్పెషలిస్ట్ రామ్ గోపాల్ వర్మ ను డైరక్టర్ గా ఎంపిక చేశారు. ఆయన ఎన్టీఆర్ బయోపిక్ ని మూడు భాగాలుగా తీస్తాని ప్రకటించారు. అయితే రీసెంట్ గా టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాను బాలయ్య పక్కన పెట్టారంట.

ఎన్టీఆర్ పై సినిమా అనగానే అతనితో పరిచయం ఉన్న చాలామంది వద్దని చెప్పారు. కొంతమంది మాత్రం అన్ని నిజాలే చెప్పాలని పట్టుబట్టారు. ఇలా అన్నివైపులా నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో ఈ సినిమా తీయకపోవడమే మంచిదని బాలకృష్ణ ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. బాలకృష్ణ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ సినిమాని పూర్తి చేసి, కె ఎస్ రవి కుమార్ డైరక్షన్ లో యాక్షన్ మూవీ చేస్తున్నారు. పైసావసూల్ దసరా కానుకగా సెప్టెంబర్ 27 న రిలీజ్ కానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus