Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Advertisement

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ కాస్టింగ్ లో మార్పులు ఎప్పుడూ చర్చకు దారి తీస్తూనేఉంటాయి. ఇప్పుడు అలాంటి హాట్ టాపిక్‌గా మారింది NBK 111 ప్రాజెక్ట్. నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ – దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదటినుంచే మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్‌గా నయనతార ఎంపిక వార్తలతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

Balayya fans

ఇప్పటికే బాలకృష్ణ – నయనతార కాంబినేషన్‌లో వచ్చిన పలు సినిమాలు మంచి విజయాలు సాధించడంతో, ఈ జోడీ మరోసారి స్క్రీన్‌పై కనిపిస్తే హిట్ గ్యారంటీ అని ఫ్యాన్స్ భావించారు. అయితే కథలో మార్పులు, ప్రొడక్షన్ ప్లానింగ్ వంటి అంశాల మధ్య ఈ ప్రాజెక్ట్ నుంచి నయనతార తప్పుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం మొదలైంది.

తాజా టాక్ ప్రకారం, ఈ సినిమా కోసం ఆమె భారీ పారితోషికం కోరినట్లు సమాచారం. అలాగే కాల్‌షీట్లు, ప్రమోషన్లకు సంబంధించిన కొన్ని షరతులు కూడా మేకర్స్‌కు సవాల్‌గా మారాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇతర ఆప్షన్లను పరిశీలించి, చివరకు కాజల్ అగర్వాల్ ను తీసుకునే దిశగా ముందుకెళ్లిందని సమాచారం.

కాజల్ ఇప్పటికే బాలకృష్ణతో కలిసి పని చేసిన అనుభవం ఉండటంతో, ఈ నిర్ణయం మేకర్స్‌కు సేఫ్ చాయిస్‌గా కనిపిస్తోంది. అయితే నయనతార తప్పుకోవడం అభిమానుల్లో మిశ్రమ స్పందనకు దారితీసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ అంశంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ సంవత్సరం సంక్రాంతికి చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ అయిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ చిత్రానికి తగినంత రెమ్యూనరేషన్ తీస్కొని, ప్రమోషన్లలో సైతం పాల్గొంది ఈ బ్యూటీ. బాలయ్య బాబుతో సినిమాకు వచ్చేసరికి ఈ విధమైన షరతులు పెట్టి, సినిమానుంచి తప్పుకోవడం బాలయ్య అభిమానుల్లో ఆగ్రహానికి కారణమైందని టాక్.

మొత్తానికి, NBK 111లో జరిగిన ఈ మార్పులు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. అధికారిక ప్రకటనల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, ఈ కాంబినేషన్ చివరకు ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus