పెద్ద ముప్పు నుంచి తప్పించుకున్న బాలయ్య హీరోయిన్ 

ఇటీవలకాలంలో సినిమా తారలు రకరకాల బ్రాండ్స్ ను తమ సోషల్ మీడియా ఎకౌంట్స్ ద్వారా ప్రమోట్ చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది. అందుకోసం వారికీ భారీ మొత్తంలో డబ్బు ముడుతుండడంతో ఈ ప్రమోషన్స్ ను కంటిన్యూ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ కేవలం కంపెనీ ప్రొడక్ట్స్ లేదా ముబైల్ ఫోన్స్ కి మాత్రమే పరిమితం అవ్వడం లేదు.. పోలిటికల్ పార్టీస్, లీడర్స్ ను కూడా ప్రమోట్ చేస్తున్నారు. అది కూడా డబ్బు తీసుకొని. ఈ విషయం అందరికీ తెలిసిందే అయినప్పటికీ.. వాళ్ళందరూ ఆ పార్టీ సిద్ధాంతాలు వారికి నచ్చి అలా చేస్తున్నాడేమోనని అందరూ అనుకున్నారు.

కానీ.. ఇదంతా పోలిటికల్ పార్టీస్ డబ్బులిచ్చి చేయిస్తున్నాయని ముంబైకి చెందిన ఒక మీడియా సంస్థ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ లో బయటపడింది. ఇలా పోలిటికల్ పార్టీస్ ని, వాళ్ళ కార్యకర్తల్ని సపోర్ట్ చేయడానికి ఈ స్టార్ హీరోహీరోయిన్లు కోట్ల రూపాయల మొత్తాన్ని అందుకుంటున్నారు. ఈ స్టింగ్ ఆపరేషన్ లో బాలీవుడ్ కి చెందిన బడా స్టార్లందరూ దొరికిపోయి అభాసుపాలయ్యారు. ఒక్క విద్యాబాలన్ మాత్రం “ఇలా డబ్బులు తీసుకొని పాలిటిక్స్ ను ప్రమోట్ చేయను” అని గట్టిగా చెప్పింది. ఆ వీడియోలు బయటకి రావడంతో స్టార్ హీరోహీరోయిన్స్ అందరూ మిగతా స్టార్ హీరోహీరోయిన్స్ ను ట్రోల్ చేస్తుండగా.. విద్యాబాలన్ మాత్రం తప్పించుకొంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus