ఒకే చేసిన కథను కూడా రిజెక్ట్ చేసిన బాలయ్య

  • December 19, 2018 / 01:05 PM IST

ఒకప్పుడు స్టార్ హీరోలు మొదలు కొని యువ కథానాయకుల వరకూ అందరూ వినాయక్ దర్శకత్వంలో నటించడానికి ఉవ్విళ్లూరేవారు. కానీ.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఆయన దర్శకత్వంలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించడం అటుంచితే, ఆయన ఫోన్ చేస్తే ఎత్తేవారు కూడా కరువయ్యారట. “ఖైదీ నెం.150” సక్సెస్ క్రెడిట్ మొత్తం చిరంజీవి ఖాతాలోకి వెళ్లిపోవడం, ఆ తర్వాత వచ్చిన “ఇంటిలిజెంట్” సినిమా 2018లోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ లో ఒకటిగా నిలవడంతో అప్పటివరకూ టాప్ ఫామ్ లో ఉన్న వినాయక్ ఒక్కసారిగా డల్ అయిపోయాడు.

అయితే.. మధ్యలో బాలయ్య తనకు “చెన్నకేశవరెడ్డి” లాంటి మంచి సినిమా ఇచ్చిన వినాయక్ కి మరో అవకాశం ఇస్తున్నట్లు టాక్ వినిపించింది. కన్నడ సూపర్ హిట్ చిత్రం “టగరు”ను రీమేక్ చేద్దామనుకున్నారు. సి.కళ్యాణ్ నిర్మించడానికి కూడా రెడీ అయిపోయాడు. కానీ.. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో బిజీగా ఉన్న బాలయ్య..ఆ తర్వాత బోయపాటికి డేట్స్ ఫిక్స్ చేసేశాడు. సో, వినాయక్ కి నో చెప్పినట్లేనని, వినాయక్ ప్రస్తుతం మరో యువ కథానాయకుడితోనే సినిమా తీసేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్నాడని వినికిడి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus