అభిమానులపై కోపంతో ఊగిపోయిన బాలయ్య !

  • June 21, 2017 / 10:00 AM IST

తెలుగు చిత్ర సీమలో హీరోలు అంటే ఫ్యాన్స్ కి అభిమానం. ఒక్కసారైన తమకు నచ్చిన హీరోని చూడాలని, తమకు నచ్చిన హీరోతో ఫోటో దిగాలి అని ఎంతగానో ఆరాటపడతారు అభిమానులు. కానీ కొన్ని కొన్ని సంధర్భాల్లో ఫ్యాన్స్ పట్ల హీరోల తీరు చూస్తే నిజంగా బాధ వేస్తుంది. ఎంతో దూరం నుంచి వచ్చిన అభిమానులు ఒక్కసారి తమకు నచ్చిన హీరోని కలసి షేక్ హాండ్ ఇస్తే చాలు జన్మ ధన్యం అయిపోతుంది అని అనుకుంటారు, కానీ హీరోలు మాత్రం తమ తమ పని ఒత్తిళ్ల వల్లనో, లేక స్టార్ డమ్ వల్లనో తెలీదు కానీ…కొన్ని కొన్ని సంధర్భాల్లో ఫ్యాన్స్ పై కోపంగా మాట్లాడటం, వారిని నెట్టి వెయ్యడం, అనుచితంగా వ్యయహరించడం జరిగింది. విషయంలోకి వెళితే నందమూరి నట సింహం బాలయ్య 101వ సినిమా ‘పైసా వాసూల్’ షూటింగ్ శేరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే అదే క్రమంలో ఈ షూటింగ్ సమయంలో ఆయన్ని కలవడానికి కొందరు అభిమానులు అక్కడకు రావడం జరిగింది. ఎంతో ఆశతో ఆయన్ని ఒక్కసారి కలసి, వీలుంటే ఒక ఫోటో తీయించుకోవాలి అని అనుకున్నా ఆ అభిమానులపై బాలయ్య కోపంతో ప్రవర్తించిన తీరు చాలా ఇబ్బంది కలిగేలా ఉంది.

ఫోటోలు తీసే సమయంలో కొందరిపై బాలయ్య కోపంతో ఊగిపోయారు. పో…ఏమిటా లుక్కు…గుద్దానంటే అయిపోతావ్ అంటూ ఫోటో తీయించుకున్న అభిమానిపై కోపంతో ఊగిపోవడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మొత్తంగా చూసుకుంటే బాలయ్య ఏ మూడ్ లో ఉన్నాడో తెలీదు కానీ ఫ్యాన్స్ కి మాత్రం బాలయ్య కాస్త ఇబ్బంది కలిగించింది అనే చెప్పాలి. మన హీరోలు అందరూ ఫ్యాన్స్ పట్ల కాస్త ఆలోచించి ప్రవర్థిస్తే ఎంతో మంచిది, ఎందుకంటే ఇంట్లో దేవుళ్ళు ఉన్నా లేకున్నా…హీరోలు అంటే అభిమానులకు ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుని పూజించే దేవుళ్ళ లెక్క.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus