తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకి సిద్దమవుతున్న పార్టీలు గెలుపు గుర్రాల మీద ద్రుష్టి పెట్టాయి. అసలు ఎవరూ ఊహించని విధంగా తెలుగుదేశం కాంగ్రెస్ తో జతకట్టింది. త్వరలో సీట్ల పంపకం కూడా తేలిపోనుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశంకు మద్దతుగా నిలిచే సామాజిక వర్గాలు అధికంగా ఉన్న చోట ఆ పార్టీ కాస్త పెద్ద మొత్తంలోనే సీట్లు అడుగుతోంది. ఎన్ని ఇస్తారో తరవాత సంగతి గాని ఆ పార్టీకి ఇచ్చేవి అర్బన్ లోనే ఎక్కువ ఉంటాయనడంలో సందేహమేం లేదు. అందులో కూడా వారు చెబుతున్న పేర్లు కూకట్ పల్లి, సనత్ నగర్, సేరి లింగంపల్లి. నిన్నటి దాకా మాజీ టీఆరెస్ లీడర్ కి ఈ సీటు ఖాయమని ప్రచారం జరగగా.
తాజాగా రాజకీయాల్లో అసలు లేని ఓ పేరు ఠక్కున తెరపైకి వచ్చింది. ఆయన ఎవరో కాదు ప్రొడ్యూసర్ భవ్య ఆనంద్ ప్రసాద్. హైదరాబాద్ లో కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటైన శేరిలింగంపల్లి నియోజకవర్గం టికెట్ ను `భవ్య క్రియేషన్స్`అధినేత – నిర్మాత ఆనంద ప్రసాద్ కు కేటాయించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంకా ఎవరి టిక్కెట్లు అఫిషియల్ గా కన్ ఫం కాలేదు. కాకపోతే ఈ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గ ఓటర్లు అధికంగా ఉన్న నేపథ్యంలో గతంలో కూడా టీడీపీయే గెలిచింది. అందుకే ఈసారి ఆయన అక్కడి నుండి పోటీ చేయడం ఖాయంగా కనిస్తోంది.ఇకపోతే.. ఇదే ఎన్నికల్లో మరో యాక్టర్ టర్నడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కూడా పోటీ చేస్తుండడం విశేషం.