బార్ బార్ ఏం దేఖాలో..!!

  • August 5, 2016 / 06:09 AM IST

మరీ హిందీలో పట్టా లేకపోయినా ఆ భాషతో కాస్త పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ “బార్ బార్ దేఖో” అనే పదానికి అర్ధం తెలిసే ఉంటుంది. దాంతో సిద్దార్ధ్ మల్హోత్రా, కత్రినా కైఫ్ లు జంటగా నిత్యా అనే లేడీ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న “బార్ బార్ దేఖో” అనగానే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే స్థాయిలో ఎంటర్ టైన్మెంటో లేక రోమాన్సో ఉంటుందేమో అనుకొన్నారందరూ. దానికి తగ్గట్లే కత్రినా ఈ సినిమాలో బికినీతో ఇంకాస్త మసాలా దట్టించింది.

కట్ చేస్తే.. నిన్న విడుదలైన “బార్ బాద్ దేఖో” ట్రైలర్ ఇప్పటివరకూ ఈ సినిమాపై ఉన్న అంచనాలన్నీతారుమారు చేసింది. ఇది రోమాంటిక్ సినిమాకు, యాక్షన్ సినిమా అంతకంటే కాదు.. ఇదో పూర్తి స్థాయి టైమ్ ట్రావెల్ మూవీ.
హాలీవుడ్ లో ఇటీవల వచ్చిన “ఎడ్జ్ ఆఫ్ టుమారో” మరియు 2008లో వచ్చిన “ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బుట్టో” కథల్ని తలపించేలా ఉందా ట్రైలర్. ఈ సినిమాలో సిద్దార్థ్ మల్హోత్రా ఒక రోజు పడుకొని మళ్ళీ నిద్ర లేచాడంటే అతడి వయసు ఓ 15 ఏళ్ళు పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు 2016 ఆగస్ట్ రాత్రి మనోడు పడుకొన్నాడనుకోండి, మళ్ళీ 2036లో నిద్రలేస్తాడు. చెప్పడానికే చాలా విడ్డూరంగా ఉన్న ఈ కథను మరి లేడీ డైరెక్టర్ ఏ విధంగా తెరకెక్కించో తెలియాలంటే సెప్టెంబర్ 9వరకూ ఆగాల్సిందే!

https://www.youtube.com/watch?v=Wiuj_GHlb64

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus