నాగార్జునతో “భాయ్” లాంటి ఆల్ టైమ్ డిజాస్టర్ సినిమా తీసిన తర్వాత కొన్నేళ్ళ విరామం అనంతరం “చుట్టాలబ్బాయ్” అంటూ మరోసారి వచ్చిన వీరభద్రం ఈసారి కామెడీతో ఆకట్టుకొంటాడు అనుకొన్నారందరూ. కానీ.. “భాయ్”కి మించి ఫ్లాప్ ఇచ్చాడు వీరభద్రం. దాంతో ఇక వీరభద్రం కెరీర్ ఖతమ్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు కూడా. కానీ.. ఎలా వచ్చాడో ఏమో కానీ మళ్ళీ మరో సినిమాకి రంగం సిద్ధం చేసుకొంటున్నాడు వీరభద్రం. అది కూడా బెల్లంకొండ శ్రీనివాస్ తో.
సాధారణంగా స్టార్ డైరెక్టర్స్ తో మాత్రమే సినిమాలు చేసే బెల్లంకొండ శ్రీనివాస్ ఈమధ్యకాలంలో కొత్త దర్శకులతో పనిచేయడం మొదలెట్టాడు. అందులో భాగంగానే వీరభద్రం చెప్పిన కథ నచ్చి.. అతడి దర్శకత్వంలో నటించేందుకు ఒకే చెప్పాడట. మరి బెల్లంకొండ బాబు తనపై పెట్టుకొన్న నమ్మకాన్ని వీరభద్రం నెలబెట్టుకొంటాడో లేక మునుపటిలాగే మరో డిజాస్టర్ ఇచ్చి హ్యాట్రిక్ డిజాస్టర్ రికార్డ్ ను సొంతం చేసుకొంటాడో చూడాలి. బెల్లకొండ శ్రీనివాస్ తాజా చిత్రం “కవచం” డిసెంబర్ 7న విడుదలవుతోంది.