విలక్షణ దర్శకుడు తేజ డైరెక్షన్లో వచ్చిన చిత్రం ‘సీత’. మే 24 న విడుదలైన ఈ చిత్రం ప్లాప్ గా మిగిలింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ జంటగా నటించిన ఈ చిత్రంలో ‘రాము’ పాత్ర పోషించాడు శ్రీనివాస్. తను ఇప్పటి వరకూ చేయని డిఫరెంట్ రోల్ పోషించాడు సాయి. అయితే ఈ పాత్ర శ్రీనివాస్ కు పెద్దగా సెట్టవ్వలేదు. ఇక సాయి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కూడా పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు.
ఈ చిత్రం తనకి కచ్చితంగా మంచి పేరు తెస్తుందని ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పుకొచ్చాడు సాయి శ్రీనివాస్. అయితే ఈ పాత్ర చేయడం తన బెల్లంకొండ సురేష్ కు ఇష్టం లేకపోయినా … ఆయన మాట కాదని తాను అంగీకరించినట్టు ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు శ్రీనివాస్ . తీరా సినిమా విడుదలయ్యాక.. అటు కాజల్ కి .. ఇటు సోనూసూద్ కి మంచి పేరు వచ్చింది. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ ను ఎవరూ పట్టించుకోలేదు. ఈ సినిమాలో ‘రాము’ పాత్రను చేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నాడట శ్రీనివాస్. తన సన్నిహితుల దగ్గర ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడట సాయి. తన తండ్రి మాట కాదని చేసినందుకు.. ఆయనకి సారీ కూడా చెప్పాడట. తన తరువాతి సినిమాల విషయంలో రిపీట్ కాకుండా చూసుకుంటానని కూడా చెప్పాడట.