మరో ప్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తున్న బెల్లంబాబు..!

నటన సో సో గా ఉన్నప్పటికీ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మాస్ లో మంచి క్రేజ్ నే ఏర్పరుచుకున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈయన సినిమాకి కనీసం 16 కోట్ల వరకూ మార్కెట్ ఉంది. ఇక ఈ హీరో సినిమాకి హిందీ డబ్బింగ్ రైట్స్ ధర భారీగానే పలుకుతుంది. రిజల్ట్ తో సంబంధం లేకుండా ఈయనతో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు ముందుకొస్తున్నారు. ఈ ఏడాది ‘రాక్షసుడు’ చిత్రంతో హిట్ అందుకోవడమే కాకుండా తన నటనతో కూడా ఆకట్టుకున్నాడు బెల్లంకొండ. అయితే ఇప్పుడు ఈయన టైం బానే ఉంది అనుకుంటున్న టైములో.. పెద్ద రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.

విషయం ఏంటంటే.. ఈ కుర్ర హీరో ఓ ప్లాప్ డైరెక్టర్ తో కాదు కాదు.. డిజాస్టర్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. ఆ డిజాస్టర్ డైరెక్టర్ మరెవరో కాదు శ్రీను వైట్ల. గత 5 ఏళ్ళుగా ఈయన ఒక్క హిట్ కొట్టడానికి ఎంత కష్టపడుతున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. ,మహేష్, రాంచరణ్, వరుణ్ వంటి సన్నిహితులు ఈయనకి అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తన ట్రబుల్ షూటర్ అని చెప్పుకునే రవితేజను కూడా పెద్ద ట్రబుల్ లో పడేసాడు. ఇలాంటి టైములో ఈయన ఓ కథ రెడీ చేసుకుంటే.. ఏ హీరో కూడా చేయడానికి ముందుకు రావడం లేదు. ఆఖరికి మంచు విష్ణు కూడా హ్యాండ్ ఇచ్చాడు అంటే శ్రీనువైట్ల కు ఎంత బ్యాడ్ టైం నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి టైములో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా చేయడానికి ముందుకు రావడం అంటే సాహసం అనే చెప్పాలి. ‘రాక్షసుడు’ డైరెక్టర్ రమేష్ వర్మ కూడా ఓ ప్లాప్ డైరెక్టరే. అతనికే హిట్ వచ్చింది. మరి శ్రీనువైట్లకు రాదా అని అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ చిత్రం ఓ బ్లాక్ బస్టర్ సినిమాకి రీమేక్.. పైగా యాజ్ ఇట్ ఈజ్ దించేశారు. మరి శ్రీనువైట్లతో సినిమా అంటే రిస్క్ అనే చెప్పాలి.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus