భారీ ఓపెనింగ్స్ సాధించిన భాగమతి

  • January 27, 2018 / 02:17 PM IST

బాహుబలి తర్వాత అనుష్క చేసిన చిత్రం భాగమతి. థ్రిల్లింగ్ జాన్రాలో రూపుదిద్దుకున్న ఈ మూవీ నిన్న రిలీజ్ అయి అందరినీ థ్రిల్ కి గురిచేసింది. అనుష్క నటనను అందరూ అభినందిస్తున్నారు. అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన అన్నిచోట్లా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. యూవీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోను 5 కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించింది. ఏరియాల వారీగా కలక్షన్స్…

ఏరియా కలక్షన్స్
నైజాం : 2 కోట్లు
సీడెడ్ : 0.68 లక్షలు
నెల్లూరు : 0.26 లక్షలు
గుంటూరు : 0.50 లక్షలు
కృష్ణ : 0.37 లక్షలు
వెస్ట్ గోదావరి : 0.27 లక్షలు
వెస్ట్ గోదావరి : 0.41 లక్షలు
ఉత్తరాంధ్ర : 0.60 లక్షలు
మొత్తం : 5.09 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus